COVID-19: SC చేతి వంట తినడానికి నిరాకరించిన బ్రాహ్మణులు

  • Published By: Subhan ,Published On : May 28, 2020 / 11:26 AM IST
COVID-19: SC చేతి వంట తినడానికి నిరాకరించిన బ్రాహ్మణులు

అసలే COVID-19.. ఆపైన క్వారంటైన్ సెంటర్. తిండి దొరకడమే గొప్ప. కానీ, అలాంటి పరిస్థితుల్లోనూ కుల, మత చాధస్తాలతో తిండి కూడా మానేస్తున్నారు. ప్రపంచం అంతా ఒక తాటిపై నడిచి కనిపించని మహమ్మారిపై పోరాడాలని ప్రధాని స్థాయి నుంచి పిలుపునిస్తుంటే.. ఆహార పదార్థాలు తయారుచేసింది తమ కులానికి చెందిన వారు కాదని తినడానికి నో చెప్పేస్తున్నారు. 

ఇటీవల జార్ఖండ్ లో SCలు తయారుచేశారని ఐదుగురు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తులు ఆహారాన్ని నిరాకరించారు. పైగా వారు COVID-19 పేషెంట్లు. జార్ఖండ్ లోని హజారీబాఘ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఈ మేరకు 100మంది హోం క్వారంటైన్ లో ఉండగా వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆహారాన్ని అందిస్తుంది. 

గ్రామ పెద్ద అందించిన సమాచారం ప్రకారం.. జిలా అధికారులు ఆ ఐదుగురికి సరుకులు ఇచ్చి వండుకొమ్మని చెప్పారు. దానికి వారు అభ్యంతరం చెప్పలేదని హజారీబాఘ్ డిప్యూటీ కమిషనర్ భువనేశ్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. వారందరికీ కరోనాపై కంటే మత, కులపరమైన అంశాలపైనే భయం ఎక్కువగా ఉందని అన్నారు. 

వారిలో ముగ్గురు వంట చేసుకుంటామని అడగడంతో బర్వార్ ఇద్గా స్కూల్ క్వారంటైన్ సెంటర్ ను ఖాళీ చేయించాం. ఇటువంటి వారిని ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉంచుతాం. ఈ క్వారంటైన్ సెంటర్లో ఖాళీ వేరే వాళ్లకు ఉపయోగపడుతుందని భావిస్తున్నామని అధికారులు అంటున్నారు. 

మరొక ఘటన:
గత వారం.. నైనిటాల్‌లో ఓ దళిత వ్యక్తి వంట చేసిందనేకారణంతో 23ఏళ్ల వ్యక్తి ఆహారాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. పైగా తాను ఇంట్లో వండిన ఆహారాన్నే తింటానని మొండికేశాడు. ముందుగా కులదూషణను తట్టుకోలేక పోయింది ఆ వంటమనిషి. కాసేపటికి ఆమె చెయ్యి తగిలిన గ్లాసులో నీరు తాగడానికి కూడా నిరాకరించాడు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అతనిపై ఫిర్యాదు నమోదు చేశారు.  

Read: కరోనా దెబ్బతో కళ తప్పిన పెళ్లిళ్లు