Drunken Teacher : మద్యం తాగి స్కూల్ కి వచ్చిన హెడ్ మాస్టర్..విద్యార్ధుల ముందే రచ్చ రచ్చ

విద్యార్ధులకు మంచి చెడులు చెప్పాల్సిన మాస్టర్ తప్పతాగి స్కూల్ కు వచ్చాడు. తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాల్సిన హెడ్ మాస్టర్ మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. నిషా తలకెక్కి విద్యార్ధుల ముందే రచ్చ రచ్చ చేశాడు. పైగా పాటలు పాడుతూ నేలమీద దొర్లుతు నానా యాగీ చేశాడు.

Drunken Teacher : మద్యం తాగి స్కూల్ కి వచ్చిన హెడ్ మాస్టర్..విద్యార్ధుల ముందే రచ్చ రచ్చ

Drunken Teacher in jharkhand

Drunken Teacher: విద్యార్ధులకు మంచి చెడులు చెప్పాల్సిన మాస్టర్ తప్పతాగి స్కూల్ కు వచ్చాడు. తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాల్సిన హెడ్ మాస్టర్ మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. నిషా తలకెక్కి విద్యార్ధుల ముందే రచ్చ రచ్చ చేశాడు. పైగా పాటలు పాడుతూ నేలమీద దొర్లుతు నానా యాగీ చేశాడు. ఓ పక్క స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయి. అదే సయమానికి తాగి తూలుతూ వచ్చాడు హెడ్ మాస్టర్..వచ్చినవాడు వచ్చినట్లే పడిపోయాడు. నేలమీద దొర్లుతు నేను తాగాను గానీ..ఏమి దొంగిలించలేదు అంటూ పాట అందుకున్నాడు. ఝూర్ఖండ్ లో జరిగిన ఈ ఘటనతో స్కూల్లో విద్యార్థులంతా బిత్తరపోయారు. మాస్టారేంటీ ఇలా తాగిపడిపోయాడు అంటూ ఆశ్చర్యంగా చూశారు. తరువాత వారి తల్లిదండ్రులకు చెప్పటంతో సదరు హెడ్ మాస్టారి ఘనకార్యం బయటపడింది.

ఝూర్ఖండ్ దుమ్కాలో షికారిపాడు బ్లాక్​లోని దర్బార్​పుర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా ఆండ్రియాస్ మరాండి పని చేస్తున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఇంటిదగ్గర తాగి ఏం చేసినా ఎవ్వరు పట్టించుకోరు. కానీ తాగి స్కూల్ వచ్చిన సదరు హెడ్ మాస్టారి నిర్వాకం బయటపడి ఉపాధ్యాయుడికి ఉండే విలువకాస్తా పోగొట్టుకోవాల్సి వచ్చింది. గురువారం (11,2022)ఉదయం 11 గంటలకు ఫుల్​గా మద్యం తాగి.. తూగుతూ వచ్చాడు. పైగా ‘నేను మద్యం మాత్రమే తాగాను.. ఏమీ దొంగలించలేదు’అంటూ ఓ పాట పాడుకుంటూ స్కూల్ కు వచ్చాడు. అలా వచ్చిన మరాండి నేలపై పడి దొర్లుతూ.. పాటలు పాడటం మొదలుపెట్టాడు.

ఈ విషయాన్ని స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో మరాండిని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. వెంటనే గ్రామస్తులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ఆండ్రియాస్ మరాండీకి తన కుర్చీలో కూర్చునే శక్తి లేదని.. ఫుల్ గా మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు.

కాగా సదరు హెడ్ మాస్టారు మద్యం తాగి స్కూల్ కు రావడం ఇదే మొదటి సారి కాదు..గతంలో చాలాసార్లే ఇలా జరిగినా విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ సారిమాత్రం సదరు మందుబాబు మాస్టారి బాగోతాన్ని స్థానికులు వీడియో తీయటంతో అదికాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఈ ఘటనపై బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి మాట్లాడుతూ.. గురువారం నాడు ఈ ఘటన జరిగిందని..సీఆర్‌పీని పాఠశాలకు పంపి విచారణ చేపట్టామని తెలిపారు. నివేదిక అందిన తర్వాత సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.