Jamshedpur: బాలిక వద్ద 12 మామిడి పళ్లు 1.2 లక్షల కొన్న వ్యాపారవేత్త..ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

చదువుకోవాలనే కోరికతో ఓ బాలిక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవటానికి మామిడి పళ్లు అమ్ముతోంది. ఆ విషయం తెలిసిన ఓ వ్యాపారవేత్త చలించిపోయారు. ఆ బాలిక దగ్గర 12 మామిడి పళ్లు 1.2 లక్షలకు కొన్నాడు. అంతే ఆ బాలిక సంతోషానికి అవధుల్లేవు.

Jamshedpur: బాలిక వద్ద 12 మామిడి పళ్లు 1.2 లక్షల కొన్న వ్యాపారవేత్త..ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Girl Tulsi Kumari Dozen Mangoes Rs. 1.2 Lakh

Girl Sells Dozen Mangoes For Rs. 1.2 Lakh : ఈరోజుల్లో పిల్లలు చదువులంటే బుక్స్ పట్టుకుని స్కూలు వెళ్లటం కాదు..స్మార్ట్ చదువులైపోయాయి. స్మార్ట్ ఫోన్ ఉంటేనే చదువు. కానీ భారత్ లో ఎంతమంది పిల్లలు స్మార్ట్ ఫోన్ కొనుక్కుని దాంట్లో ఇంటర్ నెట్ వేయించుకుని చదువుకోగలరు? పేద పిల్లల పరిస్థితి ఏంటీ? అటువంటి సౌకర్యం లేని పిల్లల చదువులు ఆగిపోవాల్సిందేనా? అంటే అటువంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో చాలామంది పిల్లలు చదువుకు మరింత దూరమైపోతున్నారు.

ఇదిలా ఉంటే చదువుకోవాలనే కోరికతో ఓ బాలిక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవటానికి మామిడి పళ్లు అమ్ముతోంది. అలా వచ్చిన డబ్బులు జమ చేసుకుని స్మార్ట్ ఫోన్ కొనుక్కుని ఆగిపోయిన తన చదువుని తిరిగి ప్రారంభించాలనుకుంది. కానీ ఎన్ని పళ్లు అమ్మితే స్మార్ట్ ఫోన్ కొనుక్కోగలదు ఆ చిన్నారి? చదువుకోవటానికి మామిడి పండ్లు అమ్ముతోందని తెలిసిన ఓ వ్యాపారవేత్త పెద్ద మనస్సుతో ఆమెకు సహాయం చేయాలనుకున్నాడు. అలా..ఆమె దగ్గరకెళ్లి 12 మామిడి పళ్లు కొన్నాడు. సాధారణంగా 12 పళ్లు ధర రూ.100 ఉంటాయి. లేదా మహా అయితే రూ.200లు అనుకుందాం. కానీ ఆ వ్యాపారవేత్త మాత్రం ఆ చిన్నారికి సహాయం చేయాలని వచ్చాడు..అందుకే ఆబాలిక వద్ద 12 మామిడి పళ్లు 1.2 లక్షలకు కొన్నాడు. అంతే ఆ బాలిక సంతోషానికి అవధుల్లేవు.

ఝార్ఖండ్ లోని జంషెడ్‌పూర్‌ కు చెందిన 11ఏళ్ల బాలిక తులసి కుమారి. ఆమె మామిడి పళ్లు అమ్ముతుంటే స్థానిక మీడియా కంట పడింది. చిన్నపిల్లవు ఇంత కష్టమేంటీ? అని అడుగగా..‘ఆన్‌లైన్‌ క్లాసులు వినాలంటే స్మార్ట్ ఫోన్ కావాలని, తన వద్ద అంత డబ్బులేదని..మామిడి పళ్లు అమ్మి..డబ్బు సంపాదించి ఓ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నానని చెప్పింది తులసి.అలా మీడియా కథనాల ద్వారా తులసి పరిస్థితి తెలుసుకున్న ముంబైకి చెందిన అమెయా హేతే అనే వ్యాపారవేత్త చలించిపోయారు.

ఆన్‌లైన్‌ క్లాస్‌లు వినేందుకు స్మార్ట్‌ ఫోన్‌ కొనుక్కోవాలనే ఆ చిన్నారి కోరిక తీర్చాలనుకున్నాడు. అలా తులసి వద్దకొచ్చి..మామిడి పళ్లను ఒక్కక్కొటి రూ.10వేలు చొప్పున.. మొత్తం 12 పళ్లును లక్షా 20వేలకు కొన్నారు. దీంతో తులసి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. షాక్ అయ్యింది. దానికి సార్..అవి అంత ధర ఉండవు సార్..అని చెప్పింది. దానికి అమెయా హేతే ‘నువ్వు ఎందుకు ఇంత కష్టపడి పళ్లు అమ్ముతున్నావో..అది నెరవేరుతుంది…ఈ పండ్లు నేను ఇంత ధరకే కొంటున్నాను’అంటూ డబ్బు ఇవ్వటంతో తులసి ఆనందం అంతా ఇంతా కాదు ఆ డబ్బుని పదే పదే తడిమి తడిమి చూసుకుంది. మురిసిపోయింది. ఆమె కళ్లల్లో ఆనందం చూసి అమెయా చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

దీనిపై ఆయన మాట్లాడుతూ..ఆ డబ్బు ఉచితంగా ఇస్తే ఆ చిన్నారి ఆత్మాభిమానం దెబ్బతింటుంది..తను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తాను ఫోన్ కొనుక్కున్నాననే ఆనందం ఆమెకు దక్కాలి.. అందుకే ఆమె మామిడి పళ్లు అంత ఖరీదుకు కొన్నానని అమెయా చెప్పారు.

తన కూతురు గురించి తులసి కుమారి తల్లి పద్మిని మాట్లాడుతూ..నా కూతురికి చదువంటేచాలా ఇష్టం. ఇప్పుడు 5వ క్లాస్ చదువుతుండగా లాక్ డౌన్ వచ్చి స్కూల్స్ మూసివేశారు. కానీ ఆన్ లైన్ క్లాసుల కోసం ఆమెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్తోమత మాకు లేదు. దీంతో నా కూతురు చదువుకోవాలనే కోరికతో రోజు మామిడి పండ్లు అమ్మగా వచ్చిన డబ్బుల్ని దాచుకుంటోందరి అలా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుందని..ఆమె పట్టుదల చూసి మేం సంతోషపడ్డాం. ఏనాటికైనా ఏదైనా సాధిస్తుందని అనుకున్నాం. ఓ మంచి మనస్సు గల వ్యక్తి వల్ల నా కూతురు స్మార్ట్ ఫోన్ కొనుక్కోగలిగింది అంటూ సంతోషం వ్యక్తంచేసింది.