సైకిల్ తొక్కుతూ…విజయాన్ని ఆశ్వాదిస్తున్న హేమంత్ సోరెన్

  • Published By: venkaiahnaidu ,Published On : December 23, 2019 / 11:00 AM IST
సైకిల్ తొక్కుతూ…విజయాన్ని ఆశ్వాదిస్తున్న హేమంత్ సోరెన్

జార్ఖండ్ లో బంపర్ మెజార్టీ దిశగా జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి దూసుకెళ్తుంది. ఇవాళ(డిసెంబర్-23,2019)ఉదయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది.  హేమంత్ సోరెన్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 41ని జేఎంఎం-కాంగ్రెస్,ఆర్జేడీ కూటమి ఇప్పటికే దాటేసింది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు కౌంటింగ్ లెక్కల ప్రకారం 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అతిపెద్ద పార్టీగా జేఎంఎం అవతరించింది. 

ఈ సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)పార్టీ చీఫ్ హేమంత్ సోర్ తన తండ్రి,మాజీ సీఎం సిబు సోరెన్ ను రాంచీలోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. జార్ఖండ్ ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో తండ్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు హేమంత్ సోరెన్. అనంతరం ఓ సైకిల్ తొక్కుతూ సరదాగా కన్పించారు సోరెన్. ఇంటి ఆవరణలో ఉషారుగా సైకిల్ తొక్కుతూ విజయాన్ని ఆశ్వాదిస్తూ కన్పించారు. ఇప్పటికే కూటమి సీఎం అభ్యర్థిగా హేమంత్ సోరెన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

అధికారికంగా కూటమి విజయం గురించి ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి మరికొన్ని గంటల సమయం ఉన్నప్పటికే ఇప్పటికే తమ విజయం ఖారారైందని సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కార్యకర్తలు. సీఎం గా సోరెన్ ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం గా సోరెన్ ప్రమాణస్వీకారంతో దేశంలోనే అత్యంత తక్కువ వయస్సులో సీఎం అయిన వ్యక్తిగా నిలవనున్నారు. 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు జార్ఖండ్ సీఎంగా ఇప్పటికే హేమంత్ సోరెన్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.