ఒళ్లుమండింది : Rs.90 లక్షల ఖరీదైన BMW కారుతో చెత్త ఎత్తుతున్న కుర్రాడు..

  • Published By: nagamani ,Published On : November 24, 2020 / 10:46 AM IST
ఒళ్లుమండింది : Rs.90 లక్షల ఖరీదైన BMW కారుతో చెత్త ఎత్తుతున్న కుర్రాడు..

Jharkhand : Ranchi man bmw luxury carrying car: తండ్రికి గిఫ్ట్ గా ఇద్దామని ఓ యువ వ్యాపారవేత్త bmw luxury కారు కొన్నాడు. ఆ కారు ఖరీదు రూ.90 లక్షలు. ఆ కారు కొని తండ్రికి సర్ ప్రైజ్ చేద్దామనుకున్నాడు. కానీ ఇంతలోనే ఓ అవాంతం వచ్చింది. ఆ ఇబ్బందితో అతను విసిగిపోయాడు..ఇరిటేట్ అయిపోయాడు. దీంతో అతను ఏకంగా రూ.అతను విసిగిపోయాడు. చిరాకొచ్చి ఆ ఖరీదైన కారులోకి చెత్త ఎత్తుతూ తన నినసన తెలిపాడు. ఇంతకీ ఈ ఇబ్బంది ఏంటంటే..



జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన యువ వ్యాపారవేత్త ప్రిన్స్ శ్రీవాస్తవ్ కు బీఎండబ్ల్యూ కారు అంటే ఎంతో ఇష్టం. ఆకారు కొని తండ్రికి కానుకగా ఇద్దామనుకని రూ.90 లక్షలు పెట్టి కాన్నాడు. కానీ తండ్రికి ఇద్దామనుకునేలోపే ఆ కారు కొన్నప్పటి నుంచి తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. కారులో టెక్నికల్ సమస్యలు ఎక్కువై తెగ చికాకు పెట్టేసాయి.




https://10tv.in/declared-dead-covid-patient-returns-to-kin-after-recovering/
బీఎండబ్ల్యు సర్వీస్ సెంటర్‌లో ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినప్పటికీ ఆ కారు ట్రబుల్ ఇస్తూనే ఉంది. దీంతో అతను విసిగిపోయాడు. ఎంతో ఇష్టపడి కొన్నకారు ఇలా తరచూ ఇబ్బందులు పెట్టేసరికి ఆ కారును చెత్త బండిగా మార్చేశాడు. బీఎండబ్ల్యు కారును రోడ్డుపై పడిన చెత్తను ఎత్తేందుకు ఉపయోగిస్తూ..నిరసన వ్యక్తం చేశాడు.



ఈ విషయంపై ప్రిన్స్ మాట్లాడుతూ క్రికెటర్స్ ఈషాన్ కిషన్, రంజీ క్రికెటర్ అజాతశత్రు కూడా కార్లలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని తెలిపారు. తరచూ కారుకు మరమ్మతు చేయించాల్సి వస్తున్నదని, ఇందుకు లెక్కకుమించి ఖర్చు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.


తరచూ కారును సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకు వెళుతుండటంతో సెంటర్ యజమానులు కూడా విసుగు చెందున్నారన్నారు. ఈ విషయమై తాను కోర్టుకు వెళతానని తెలిపారు. ఇంత పెద్ద కంపెనీకి చెందిన కారు ఇలా ఇబ్బందులకు గురిచేస్తుందననీ నా సహనానికి పరీక్ష పెడుతుందని తాను ఎప్పుడు అనుకోలేదని వాపోయాడు.