తప్పొప్పులతో మాకు పనిలేదు : ప్రేమలో ఇద్దరు అమ్మాయిలు..పెళ్లి

  • Published By: nagamani ,Published On : December 8, 2020 / 04:22 PM IST
తప్పొప్పులతో మాకు పనిలేదు : ప్రేమలో ఇద్దరు అమ్మాయిలు..పెళ్లి

jharkhand same sex couple marriage : స్వలింగ వివాహాలు (Same-sex marriage) కల్చర్ పెరుగుతోంది. సమాజంలో ఇటువంటి పెళ్లిళ్లపై వ్యతిరేకత ఉంది. ఇటువంటి వివాహాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కానీ సమాజంలో మాత్రం వ్యతిరేకత చాలా ఉంది. కానీ భిన్నంగా ఆలోచించే వాళ్లు మాత్రం తప్పేంటి అంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అమ్మాయిలు ఐదు సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. తమ బంధాన్ని విడదీస్తారనే భయంతో ఇరు కుటుంబాలవారికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.



కానీ ఎంతకాలం ఇలా? అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతే వాళ్లు ఊహించిందే జరిగింది? ఏంటీ మీకేమన్నా పిచ్చెక్కిందా? ఇద్దరు అమ్మాయిలు పెళ్లిచేసుకోవటమేంటీ అంటూ మండిపడ్డారు ఇరు కుటుంబాల వాళ్లు. దీంతో వాళ్లు ఇంటిలోంచి వెళ్లిపోయి మరీ పెళ్లిచేసుకున్నారు.


వివరాల్లోకి వెళితే..జార్ఖండ్​లోని కొడెర్మాకు చెందిన ఇద్దరమ్మాయిలు వివాహం చేసుకోవడంతో స్వలింగ్ వివాహాల విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. వీరిలో ఒకరికి 20 ఏళ్లు కాగా..మరొకరికి 24ఏళ్లు.వీరిద్దరూ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా రిలేషన్ కొనసాగించారు. చివరగా గత నవంబర్ 8,2020న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.



తరువాత వారి ఇళ్లకు సమీపంలో ఉండే చంద్రచౌక్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం మొదలుపెట్టారు..వీరు చంద్రచౌక్ లో ఉంటున్నారని తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు అక్కడికి చేరుకుని గొడవ చేశారు ఎవరి పిల్లల్ని వాళ్లు తీసుకెళ్లటానికి యత్నించారు. దీనికి వాళ్లు ససేమిరా ఒప్పుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ కేసును ఎలా నమోదుచేసుకోవాలో తెలీక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో వాళ్లక్కూడా ఏం చేయాలో తెలీలేదు.



మా పెళ్లి మీరు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయిన పరవాలేదు. మా పెళ్లిని మేం చట్టబద్ధం చేసుకుంటాం అని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం దీనికి చట్టం లేకపోయినా భవిష్యత్తులో అయినా చట్టబద్దం చేసుకుంటామని చెప్పేశారు.