కట్నం కోసమే డాక్టర్లు అవుతున్నారు : హెల్త్ సెక్రటరీ వివాదాస్పద వ్యాఖ్యలు

కట్నం కోసమే డాక్టర్లు అవుతున్నారు :  హెల్త్ సెక్రటరీ వివాదాస్పద వ్యాఖ్యలు

Jharkhand ‘Some Become Doctors To Get Handsome Dowry’: వరకట్నం భారీగా తీసుకోవటానికి డాక్టర్లు అవుతున్నారంటూ డాక్టర్లపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నితిన్ కులకర్ణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారీగా కట్న కానులకు తీసుకోవటానికి డాక్టర్ వృత్తిని చేపడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డాక్టర్ నితిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై డాక్టర్లు మండిపడుతున్నారు. ఓ బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయటమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డాక్టర్ నితిన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..సీఎం హేమంత్ సోరెన్‌ను కోరింది. సెంబర్ 30న జార్ఖండ్‌లో కొత్తగా నియమితులైన డాక్టర్లను ఉద్దేశించి డాక్టర్ నితిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పైగా పని చేయక్కర్లేదు కాబట్టి కొంతమంది డాక్టర్లు అవుతున్నారనీ..ఇంకొందరైతే..ఎక్కువ కట్నం సంపాదించొచ్చని డాక్టర్ వృత్తిని ఎంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో జార్ఖండ్ డాక్టర్స్ అసోసియేషన్ నితిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

డాక్టర్లను అవమానిస్తు ఆయన చేసిన కులకర్ణిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కులకర్ణి చేసిన వ్యాఖ్యలు డాక్టర్ వృత్తికే అవమానకరమైనవని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి డాక్టర్లు చేసిన సేవల గురించి మొత్తం ప్రపంచమే సలామ్ చేస్తుంటే నితిన్ మాత్రం ఇలా గేలిగా లేకిగా మాట్లడటాన్ని డాక్టర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని..లేకుంటే ఇంకా డాక్టర్లపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారోనంటూ సీఎంను కోరుతో లేఖ రాసింది.

కాగా..కరోనా కాలంలో వైద్య సమాజం విశేష సేవలు అందించిందని ఐఎంఏ ఆ లేఖలో పేర్కొంది. కరోనా పోరులో వైద్యులు ముందున్నారనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదుని ఈ విషయం అందరికి తెలిసిందేనని తెలిపింది.

ఈ క్రమంలో 734 మంది డాక్టర్లను కూడా కోల్పోయామని.. అయినప్పటికీ కొత్త కొత్త వైరస్ లు వస్తున్నా ఆ సవాళ్లకు భయపడకుండా..వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని వివరించింది. కాగా, ఐఎంఏ ప్రతినిధి బృందం, జార్ఖండ్ హెల్త్ సర్వీసెస్ అసోసియేషన్ కలిసి ఆరోగ్య మంత్రి బన్నా గుప్తాను కలిసి డాక్టర్ నితిన్ కులకర్ణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నాయి.