జార్ఖండ్ లో ‘పోలియో’కలవరం..! 6 ఏళ్ల బాలుడిలో కనిపించిన పాత మహమ్మారి లక్షణాలు..!!

  • Published By: nagamani ,Published On : November 5, 2020 / 01:06 PM IST
జార్ఖండ్ లో ‘పోలియో’కలవరం..! 6 ఏళ్ల బాలుడిలో కనిపించిన పాత మహమ్మారి లక్షణాలు..!!

Jharkhand 6 year old boy polio Suspected : పోలియో రహిత దేశంగా భారత్ అవతరించిన వేళ.. ఝార్ఖండ్‌లో పోలియో మహమ్మారి లక్షణాలు కనిపించటంతో ఆందోళన కలిగిస్తోంది. 6 సంవత్సరాల బాలుడిలో పోలియో లక్షణాలు కనిపించడం జార్ఖండ్ లో కలకం రేపింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు వెంటనే అప్రమత్తమైయ్యారు. ఆ బాలుడి నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెరాలజీ (ఐఐఎస్) ‌కు పంపారు.


గత కొన్ని వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. ఆ బాలుడికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు అతనిలో పోలియో లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ బాలుడి నుంచి వెంటనే నమూనాలు సేకరించి ఐఐఎస్‌కు పంపించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ రావటానికి 15 రోజుల సమయం పడుతుంది.



కాగా.. భారత్‌లో చాలా ఏళ్ల క్రితమే పోలియో మాయమైంది. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఆ తరువాత రెండేళ్ల క్రితం అంటే 2018లో 13 కేసులు, 2019లో 32 కేసులను పోలియోగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత అవి పోలియో కాదని తేలింది. ఈ క్రమంలో జార్ఖండ్ లో 6ఏళ్ల బాలుడిలో పోలియో లక్షణాలు కనిపించడం డాక్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.



జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని మనోహర్‌పూర్-ఆనంద్‌పూర్ బ్లాక్ నుంచి పోలియో వచ్చిన మొదటి అనుమానాస్పద కేసు ఇది అనీ..WHO సమన్వయకర్త డాక్టర్ సుమన్ తెలిపారు.6 సంవత్సరాల బాలుడి పోలియో లక్షణాలు కనిపించటంతో ఆ బాలుడి మలం నమూనాను ఐఐఎస్-కోల్‌కతాకు పరీక్ష కోసం పంపించామని డాక్టర్ సుమన్ తెలిపారు. ఐఐఎస్ నుండి 15 రోజుల్లో రిపోర్ట్ వస్తాయని దీనికి సంబంధించి నివేదిక వచ్చిన తరువాతే ఇది పోలియోనా లేక కేవలం అనుమానం మాత్రమేనా అనేది తేలుతుందని తెలిపారు.



“పోలియో కాకుండా, గుల్లెయిన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్), ట్రాన్స్వర్స్ మైలిటిస్, ట్రామాటిక్ న్యూరిటిస్, ట్రాన్సియెంట్ పక్షవాతం, ఫేషియల్ పాల్సీ మరియు పరేసిస్ కూడా AFP కి దారితీయవచ్చని అన్నారు. గత మూడు సంవత్సరాలలో 64 మంది పోలియో కేసుల నమూనాలను చైబాసా నుండి ఐఐఎస్‌కు పంపారనీ..కానీ ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారణ కాలేదనీ డాక్టర్ సుమన్ తెలిపారు.



2018 లో, వెస్ట్ సింగ్భూమ్ నుండి 2019 లో పోలియో 32 నమూనాల అనుమానాస్పద కేసులకు 13 నమూనాలను ఐఐఎస్-కోల్‌కతాకు పరీక్ష కోసం పంపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు పరీక్ష కోసం 19 నమూనాలను పంపారు. 2018 నుండి నమూనాలు ఏవీ పాజిటివ్‌ గా నిర్ధారించబడలేదని అన్నారు.



దీనిపై వెస్ట్ సింభూమ్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ ఓపి గుప్తా మాట్లాడుతూ.. రూర్కెలాలోని ఇస్పాట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు అక్కడ పరీక్షించిన తరువాత బాలుడికి పోలియో ఉందని అనుమానించి వారి నివేదికను చైబాసా సదర్ హాస్పిటల్ (సిఎస్హెచ్) కు పంపారనీ..మేము వెంటనే ఐఐఎస్ వద్ద పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నామనీ..ఈ విషయాన్ని జిల్లా డబ్ల్యూహెచ్ఓ సమన్వయకర్తకు సమాచారం ఇచ్చామని డాక్టర్ గుప్తా తెలిపారు. కాగా..బాలుడి నమూనాల పరీక్షలకు సంబంధించి రిపోర్ట్ వస్తేనే గానీ అది పోలియోనా కాదా అనేది తెలియనుంది.