విద్యార్ధులకు పాకిస్థాన్ జాతీయ గీతం నేర్పుతున్న జార్ఖండ్ టీచర్

  • Published By: nagamani ,Published On : July 14, 2020 / 11:20 AM IST
విద్యార్ధులకు పాకిస్థాన్ జాతీయ గీతం నేర్పుతున్న జార్ఖండ్ టీచర్

జార్ఖండ్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్చుకోవాలని వాటిని కంఠస్థం చేయాలని కిండర్ గార్టెన్ విద్యార్థులకు చెప్పి..దాన్ని హోం వర్కుగా ఇచ్చిన ఘటన వివాదం చెలరేగింది. కరోనా వ్యాప్తం క్రమంలో ఆన్ లైన్ క్లాసుల్లో జార్ఖండ్ టీచర్ విద్యార్దులకు ఇటువంటి పాఠాలు చెబుతుంటం తీవ్ర వివాదంగా మారిన ఘటన ఆదివారం (జులై13,2020)న వెలుగులోకి వచ్చింది.

తూర్పు సింఘ్ భూమ్‌ జిల్లా జంషెడ్‌పూర్‌ సిటీలోని ఓ ప్రైవేటు స్కూల్‌ లో టీచర్ గా పనిచేస్తున్న శైలా పర్వీన్‌ భారతీయ జాతీయ గీతం తోపాటుగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జాతీయ గీతాలను కూడా పిల్లలకు నేర్పిస్తోంది. ఈ విషయం జిల్లా విద్యాశాఖ యంత్రాంగం దృష్టికి రావటంతో దీనిపై విచారణ చేపట్టింది. దీనిపై డిప్యూటీ కమిషనర్ రవిశంకర్ శుక్లా ప్రాంతీయ విద్యాశాఖాధికారి కేశవ్ ప్రసాద్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బృందంతో పూర్తి విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని జిల్లా విద్యాశాఖాధికారి శివేంద్ర కుమార్ తెలిపారు.

ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు ఆన్‌లైన్‌ లో పాఠాలు చెప్తూ‌ పాక్, బంగ్లా‌ జాతీయ గీతాలు నేర్చుకోవాలని శైలా పర్వీన్ హోమ్ వర్క్ ఇచ్చింది. అంతేకాదు వీటికి సంబంధిచిన యూట్యూబ్‌ లింకులను కూడా వారికి షేర్‌ చేసింది. దీనిపై ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నేత కునాల్‌ సారంగితో పాటు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.