చెప్పారు.. చేస్తున్నారు: పేద ప్రజలకు రూ.10కే చీర, లుంగీ

చెప్పారు.. చేస్తున్నారు: పేద ప్రజలకు రూ.10కే చీర, లుంగీ

Jharkhand:సీఎం హేమంత్ సోరెన్ పేదలకు వస్త్రాలపై సబ్సీడి ఇచ్చారు. ఇందులో భాగంగానే పేదరికానికి దిగువగా బతుకీడుస్తున్న కుటుంబాలకు సబ్సీడి ధర రూ.10కే ధోతీలు, లుంగీలు, చీరలు సంవత్సరానికి రెండు సార్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

సీఎం సోరెన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హత కలిగిన వారంతా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద.. అంత్యోదయ అన్నా యోజన కింద ఆరు నెలలకోసారి బట్టలు పొందొచ్చని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అది కూడా రూ.10కే ధోతీ/లుంగీ లేదా చీర పొందవచ్చు.



ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బట్టలు ఒకసారి పంపిణీ చేయనున్నారు. అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఎలక్షన్ మ్యానిఫెస్టోలో ధోతీ, చీరలు తక్కువ ధరకే అందజేస్తామని ప్రకటించింది.