TV చూస్తున్న ఐదుగురు పిల్లల్ని భవనం మీదకు లాక్కెళ్లి విసిరేసిన మహిళ

  • Published By: nagamani ,Published On : November 2, 2020 / 03:56 PM IST
TV చూస్తున్న ఐదుగురు పిల్లల్ని భవనం మీదకు లాక్కెళ్లి విసిరేసిన మహిళ

Jharkhand ; అది జార్ఖండ్ రాష్ట్రం. సాహెబ్ గంజ్ పట్టణంలోని బిహారీ లాల్ మండల్ ఏరియా. ఆ ఏరియాలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులు 10మందిపిల్లలు టీవీ చూస్తున్నారు. సడెన్ గా వచ్చిన ఓ మహిళ ఆ 10మంది పిల్లల్లో ఒక్కొక్కరినీ భవనం పైకి తీసుకెళ్లి కిందకు విసిరేసింది.



https://10tv.in/man-killed-over-illegal-affair-by-husband/
అలా ఒక్కొక్కరినీ భవంనంపైకి లాక్కెళ్లి ఐదుగురు పిల్లల్ని విసిరేసింది. ఆదివారం (నవంబర్ 1,2020)సాయంత్రం జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు సాహెబ్ గంజ్ పట్టణంలోని బిహారీ లాల్ మండల్ భవన్ లో 10 మంది పిల్లలు టీవీ చూస్తుండగా ఓ మహిళ పిల్లల్ని టెర్రస్ పైకి తీసుకువెళ్లి ఒక్కొక్కరిని కిందకు విసిరేసింది.


అలా ఐదుగురు పిల్లల్ని భవనం పైకి లాక్కెళ్లి విసిరేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లల్ని భవనం పైనుంచి పారేస్తుండగా బుధన్ మండల్ అనే వ్యక్తి యత్నించాడు. పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. కానీ భవనంపైనుంచి విసిరివేయబడిన పిల్లల కుటుంబాలు సదరు మహిళపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.


కానీ ఈ విషయం తెలిసిన పోలీసులు మాత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సదర్ పోలీసుస్టేషనుకు పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు గత కొంతకాలం నుంచి మానసిక స్థితి బాగాలేదని తెలిపారు.