డౌన్ లోడ్ స్పీడ్ లో జియో….అప్ లోడ్ లో వొడాఫోన్ నెం.1

  • Published By: venkaiahnaidu ,Published On : October 13, 2020 / 08:22 PM IST
డౌన్ లోడ్ స్పీడ్ లో జియో….అప్ లోడ్ లో వొడాఫోన్ నెం.1

Jio tops in download speed మరోసారి వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో నిలిచింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది మొబైల్ యూజర్లకు సేవలందిస్తున్న రిలయన్స్ జియో…19.3 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో మరోసారి నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ట్రాయ్(టెలికాం రెగ్యూలలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా) తాజా నివేదిక ఈ వెల్లడించింది.



డౌన్‌లోడ్ స్పీడ్‌ లో జియో తరువాత 8.6 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఐడియా రెండో స్థానంలో ఉండగా, 7.9 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వోడాఫోన్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక 7.5 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఎయిర్‌టెల్ నాల్గవ స్థానంలో ఉంది. అక్టోబర్ 10 ట్రాయ్ ఈ నివేదికను వెల్లడించింది. ఇక, వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనమైనప్పటికీ.. ట్రాయ్ మాత్రం ఆ కంపెనీల పనితీరును విడివిడిగానే పరిగణనలోకి తీసుకుంది. దేశంలోని 49 నగరాల్లో ఓపెన్‌ సిగ్నల్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

రియల్ టైమ్ బేసిన్ ఆధారంగా డేటా స్పీడ్‌ను ట్రాయ్ లెక్క గట్టింది. ఆగస్టు నెలతో పోల్చితే సెప్టెంబర్‌లో దాదాపు అన్ని కంపెనీల డౌన్‌లోడ్ స్పీడ్ పెరిగింది. ఆగస్టులో 15.9 ఎంబీపీఎస్ గా ఉన్న జియో డౌన్‌లోడ్ స్పీడ్.. 21శాతం మెరుగుపడి సెప్టెంబర్‌లో 19.3 ఎంబీపీఎస్ కు శాతానికి చేరుకుంది. ఆగస్టులో 7 శాతంగా ఉన్న ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ స్పీడ్.. 7 శాతం మెరుగుపడి సెప్టెంబర్‌లో 7.5 శాతానికి చేరుకుంది.



ఇక, అప్‌లోడ్ స్పీడ్ విషయంలో… 6.1 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వొడాఫోన్ మొదటిస్థానంలో నిలిచింది. 5.9 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఐడియా రెండవ స్థనంలో, 3.4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఎయిర్‌టెల్ మూడవ స్థానంలో, 3.3 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో నాల్గవ స్థానాల్లో నిలిచాయి.