Jio Plan : జియో మరో సంచలనం.. ఒక్క రూపాయికే.. 30 రోజుల వ్యాలిడిటీ

ఇటీవలే రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. తాజాగా వారికి కాస్త రిలీఫ్ కలిగించే వార్త చెప్పింది.

Jio Plan : జియో మరో సంచలనం.. ఒక్క రూపాయికే.. 30 రోజుల వ్యాలిడిటీ

Jio Plan

Jio Plan : ఇటీవలే రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. తాజాగా వారికి రిలీఫ్ కలిగించే వార్త చెప్పింది. మరో సంచలన, విభిన్నమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా అత్యంత చౌకైన ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ రేట్ ఒక్క రూపాయే. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.

ఒక్క రూపాయి జియో ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 100 ఎంబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఈ డేటా అయిపోయిన తర్వాత యూజర్ 64 కేబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఎక్కువ డేటా అవసరం లేదనుకునే వారికి ఈ రూపాయి ప్లాన్‌ బాగా యూజ్ అవుతుంది. అలాగే వ్యాలిడిటీ కోసమే వినియోగించే వారికి ఇది ఉపయోగపడుతుంది. జియో తాజా నిర్ణయం ఇతర నెట్ వర్క్ కంపెనీలను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

అత్యంత తక్కువ ధరకే డేటా అందిస్తున్న సంస్థ తమదేనని జియో తెలిపింది. చాలా సెలైంట్ గా ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో విడుదల చేసింది. దేశంలో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇదేనని జియో చెప్పింది. దేశంలోని ఏ ఇతర నెట్ వర్క్ కంపెనీ కూడా ఈ ధరకు ప్లాన్ తీసుకురాలేదని వెల్లడించింది. ఈ కొత్త ప్లాన్ ను మైజియో యాప్ లో చూడొచ్చు. 4G డేటా వోచర్ విభాగంలోని ఇతర ప్లాన్‌లో ఇది కనిపిస్తుంది. ప్రస్తుతం జియో 1జీబీ డేటా యాడ్ఆన్ ప్యాక్ ధర రూ.15గా ఉంది. అదే ఈ రూ.1 ప్లాన్‌ పది సార్లు రీచార్జ్ చేసుకుంటే ఆ మొత్తం డేటా రూ.10కే వస్తుంది. మొత్తంగా అతి చౌక ప్లాన్‌ తీసుకొచ్చి మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది జియో.

అలాగే తన ప్రారంభ రూ.119 ప్లాన్‌ ప్రయోజనాలను జియో ఇటీవలే సవరించింది. ఈ ప్లాన్‌కు ఎస్ఎంఎస్‌లను కూడా అందించడం ప్రారంభించింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 14 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. కొత్త మార్పుతో రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు కూడా జత కానున్నాయి. గతంలో ఈ ప్లాన్‌ ధర రూ.98గా ఉండగా.. అన్ని ప్లాన్‌లతో పాటు దీని ధర కూడా పెరిగింది.

Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. పంపడానికి ముందే చెక్ చేసుకునేలా

టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. ఆరంభం నుంచి అన్ని విషయాల్లో వినూత్న తరహాలో ముందుకు సాగుతోంది. అనేక విభిన్నమైన ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా అత్యంత చౌకైన ప్లాన్‌ను ప్రకటించి మరో సంచలనం రేపింది. జియో కస్టమర్లను సంతోష పెట్టడానికి, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి జియో ఈ చౌకైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఇటీవలే టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచారు. వొడాఫోన్ ఐడియా (Vi), భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 4G ప్రీపెయిడ్ ప్యాక్‌ల ధరలను 25 శాతం వరకు పెంచాయి.