Modi in Rajya Sabha : మీరు ఎంత బురద చల్లితే ‘కమలం’ అంతగా వికసిస్తుంది: ప్రధాని మోడీ

మీరు ఎంత బురద చల్లితే ‘కమలం’ అంతగా వికసిస్తుంది అంటూ పార్లమెంట్ లో కాంగ్రెస్, విపక్షాలు చేసిన విమర్శలపై ఎదురు దాడి చేస్తూ ధీటుగా సమాధానమిచ్చారు ప్రధాని మోడీ

Modi in Rajya Sabha : మీరు ఎంత బురద చల్లితే ‘కమలం’ అంతగా వికసిస్తుంది: ప్రధాని మోడీ

'Jitna keechad uchaloge, kamal utna hi khilega' PM Modi's speech in Rajya Sabha

Modi speech in Rajya Sabha : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. అదానీ వ్యవహారంపై ప్రధాని మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల సభ్యుల నినాదాల మధ్యే ప్రధాని మోడీ స్టైల్లో మరి ముఖ్యంగా చెప్పాలంటూ డిమాండ్ ను పక్కదారి పట్టించటానికి ఆయన ప్రసంగం తూటాల్లాంటి మాటలతో ప్రసంగం కొనసాగింది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు,డిమాండ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మోడీ.

దీంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కుంభకోణాల ప్రభుత్వం అని దేశాభివృద్ధి కోసం పాటు పడే మా ప్రభుత్వంపై కాంగ్రెస్ బురద చల్లుతోందని..మీరు నాపై చల్లే బురదలోంచే కమలం వికసిస్తుంది ( “జిత్నా కీచద్ ఉచలోగే, కమల్ ఉత్నా హీ ఖిలేగా”)అంటూ తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు మోడీ. అంతేకాదు మా విజయానికి కాంగ్రెస్ ఇచ్చిన సహకారం మరువలేనిది అంటే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చల్లే బుదరలోంచే అంటే బీజేపీ గుర్తు కమలం అన్నట్లుగా మోడీ స్టైలాఫ్ గా మోడీ మాటల తూటాలు పేలాయి రాజ్యసభలో.

మీరు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని విపక్ష సభ్యులను ఉద్దేశించి..ముఖ్యంగా కాంగ్రెస్ ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందన్నారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అంటూ ఏకిపారేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను నిరాకరిస్తున్నారని..ఎన్నికల్లో బీజేపీని గెలిపించటం ద్వారా ప్రజలు చెప్పేది అదేనన్నారు. యూపీఏ పాలనలో నేను గమనించింది ఏమిటంటే ఏ ఒక్క సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపలేదని.. ఉన్న సమస్యలను పరిష్కరించలేక..పరిష్కరించటం చేతకాక వాటికి తాత్కాలికంగా పైపూత పూత రాసి చేతులు దులుపుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

దేశ ప్రజలను దగా చేసిన పార్టీ కాంగ్రెసే అన్నారు.ఒక వ్యక్తి చాలా మందిని ఎలా బలంగా ఎదుర్కొంటున్నాడో దేశం గమనిస్తోందని.. నేను దేశం కోసమే బతుకుతున్నాను అంటూ రాజ్యసభలో మోడీ తెలిపారు. ఇలా మోడీ ప్రసంగంలో ఎన్నో ఎన్నెన్నో వినూత్న వ్యాఖ్యలు చేస్తూ గాంధీ కుటుంబం పేరుపైనే అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ..నెహ్రూ పేరు పెట్టుకోవడానికి ఎందుకంత అవమానం? అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబ సభ్యులు నెహ్రూ పేరును ఎందుకు తమ పేరు చివర్లో పెట్టుకోలేదని, అంత అవమానకరంగా వాళ్లు ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.