J&K Encounter : పూంచ్- రాజౌరీలో ఏడో రోజుకి చేరిన సెర్చ్ ఆపరేషన్..ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైన్యం

జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ మరియు రాజౌరీ సరిహద్దు జిల్లాల అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ ఏడో రోజుకి చేరింది.

J&K Encounter : పూంచ్- రాజౌరీలో ఏడో రోజుకి చేరిన సెర్చ్ ఆపరేషన్..ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైన్యం

Jk (1)

J&K Encounter జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ మరియు రాజౌరీ సరిహద్దు జిల్లాల అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ ఏడో రోజుకి చేరింది. ఆదివారం అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో తల్లి-కొడుకు సహా ముగ్గురు వ్యక్తులను బలగాలు అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు.

భటదుడియాలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల మహిళ, ఆమె కుమారుడితో పాటు మరో వ్యక్తిని ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు ఈ ముగ్గురు స్వచ్ఛందంగా లేక బెదిరింపులకు దిగడంతో ఆహారం, ఆశ్రయం ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజోరీ – పూంచ్‌ హైవేపై ఈ నెల 14నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. గత వారం రోజులుగా పూంచ్ మరియు రాజౌరీలో ఉగ్రవాదులతో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో తొమ్మిది మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే.

ALSO READ  అలయ్ బలయ్, బండి సంజయ్‌తో మాట్లాడిన కవిత..ఫొటో వైరల్