Mehbooba Mufti: దేవాలయానికి వెళ్లి పూజలు చేసిన మెహబూబా ముఫ్తీ.. రాజకీయ జిమ్మిక్కు అన్న బీజేపీ

మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక దేవాలయాన్ని సందర్శించారు. పూంఛ్ జిల్లాలోని నవగ్రహ టెంపుల్‌ను సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే, మెహబూబా ముఫ్తీ పూజలు చేయడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే మెహబూబా దేవాలయాలు సందర్శిస్తున్నారని విమర్శించింది.

Mehbooba Mufti: దేవాలయానికి వెళ్లి పూజలు చేసిన మెహబూబా ముఫ్తీ.. రాజకీయ జిమ్మిక్కు అన్న బీజేపీ

Mehbooba Mufti: పీడీపీ అధినేత్రి, జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక దేవాలయాన్ని సందర్శించారు. పూంఛ్ జిల్లాలోని నవగ్రహ టెంపుల్‌ను సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే, మెహబూబా ముఫ్తీ పూజలు చేయడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే మెహబూబా దేవాలయాలు సందర్శిస్తున్నారని విమర్శించింది. బీజేపీ నేత, జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా.. మెహబూబా ముఫ్తీపై విమర్శలు చేశారు. ‘‘నేను కూడా దేవాలయం నుంచి ఇప్పుడే వచ్చాను. కానీ, వార్తల్లో మాత్రం ఆమె పేరే వినబడుతోంది. ఎందుకంటే ఆమే ఏదో కొత్తగా చేస్తోంది. ఎన్నికలు రాబోతున్నప్పుడల్లా ఇలాంటి డ్రామాలు, జిమ్మిక్కులు చేయడం సహజం. ఒకవేళ వాళ్లు నిజంగా మనస్ఫూర్తిగా ఇలాంటివి చేస్తే మంచిదే. ఇలా చేస్తే దేశం కోసం, జమ్ము-కాశ్మీర్ కోసం పని చేసే శక్తిని, తెలివిని దేవుడు ఇస్తాడు.

వాళ్లు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వరు అనుకుంటున్నా’’ అంటూ కవిందర్ గుప్తా వ్యాఖ్యానించారు. ముఫ్తీ దేవాలయంలో పూజలు చేసి, జలాభిషేకం కూడా చేశారని పీడీపీ నేత ఉదేష్ పాల్ శర్మ చెప్పారు. దీనిపై ముఫ్తీ మాట్లాడుతూ ‘‘ఈ దేవాలయాన్ని ఉదేష్ పాల్ శర్మ తండ్రి యష్ పాల్ శర్మ కట్టారు. ఆ గుడిని సందర్శించాల్సిందిగా ఉదేష్ పాల్ శర్మ కోరాడు. అక్కడికి వెళ్లాక అభిషేకం చేయమని నీళ్లిచ్చారు. అందులో తప్పేం లేదనిపించి అలా చేశాను’’ అన్నారు.