Rajouri Blast Case :రాజౌరి బ్లాస్ట్‌ కేసులో ఉగ్రవాది తాలిబ్‌ హుస్సేన్‌ గుట్టురట్టు..బీజేపీని బురిడి కొట్టించి ఐటీ సెల్‌ ఇన్‌చార్జిగా నియామకం..

తుక్సన్‌ గ్రామాన్ని సెంటర్‌గా చేసుకొని.. ఉగ్రరచనలు చేస్తున్న తాలిబ్‌ హుస్సేన్‌ ఎవరో కాదు.. బీజేపీ జమ్ముకశ్మీర్‌ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌..! జమ్ముకశ్మీర్‌లో బీజేపీ కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయే తాలిబ్‌ హుస్సేన్‌ నిజస్వరూపం బయటపడింది.

Rajouri Blast Case :రాజౌరి బ్లాస్ట్‌ కేసులో ఉగ్రవాది తాలిబ్‌ హుస్సేన్‌ గుట్టురట్టు..బీజేపీని బురిడి కొట్టించి ఐటీ సెల్‌ ఇన్‌చార్జిగా నియామకం..

Taiba Terrorist Arrested In J&k Was Bjp's Social Media Incharge

Rajouri Blast Case..Terrorist in J&K Was BJP’s Social Media Incharge : అతనో కరుడుగట్టిన ఉగ్రవాది.. రాజౌరి బ్లాస్ట్‌ కేసులో మాస్టర్‌ మైండ్‌..! అయితే అన్నిటికంటే ముఖ్యమైందేంటంటే అతనో పెద్ద నటుడు..! ఎంత యాక్ట్‌ చేయగలడంటే ఓ జాతీయ పార్టీని బురిడి కొట్టించేంతలా..! పైకి మంచివాడిలా, అమాయకుడిలా, ప్రజల కోసమే పుట్టిన నాయకుడిలా బిల్డప్‌ ఇచ్చే తాలిబ్ హుస్సేన్ షా గుట్టును జమ్ముకశ్మీర్‌ తుక్సన్‌లో గ్రామ ప్రజలు రట్టు చేశారు. ఆశ్రయం పేరుతో తమ గ్రామంలోకి వచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను గ్రామస్తులు ఎంతో ధైర్యసాహసాలతో పట్టుకొని నిర్బంధించారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాదులను తాలిబ్‌ హుస్సేన్‌ షా, ఫైజల్‌ అహ్మద్‌ దార్‌గా పోలీసులు గుర్తించారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. తుక్సన్‌ గ్రామాన్ని సెంటర్‌గా చేసుకొని.. ఉగ్రరచనలు చేస్తున్న తాలిబ్‌ హుస్సేన్‌ ఎవరో కాదు.. బీజేపీ జమ్ముకశ్మీర్‌ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌..! జమ్ముకశ్మీర్‌లో బీజేపీ కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయే తాలిబ్‌ హుస్సేన్‌ నిజస్వరూపం బయటపడింది. పార్టీలో యాక్టవ్‌గా ఉంటూ పార్టీ రహస్యలను తెలుసుకునేవాడు తాలిబ్‌ హుస్సేన్‌.. ఇప్పుడు జరుగుతన్న అమరనాథ్‌ యాత్రలో భక్తులే టార్గెట్‌గా తాలిబ్‌ వ్యూహాలు పన్నినట్లు నిఘా వర్గాల సమాచారం..! ఇంతటి కరుడుగట్టిన ఉగ్రవాది ఓ జాతీయ పార్టీకి ఐటీ సెల్‌కు ఎలా ఇంఛార్జ్‌ అయ్యాడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జమ్ముకశ్మీర్‌లో రియాసీ జిల్లాలో పట్టుబడిన ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదుల్లో ఒకరు తాలిబ్‌ హుస్సేన్‌.. ఇతను బీజేపీ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు. తాలిబ్‌ హుస్సేన్‌ను బీజేపీ జమ్ము మైనార్టీ మోర్చా ఐటీ అండ్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా నియమిస్తూ గత మే 9న పార్టీ ఆర్డర్‌ విడుదల చేసింది. ఇక తాలిబ్‌ హుస్సేన్‌ షాకు పలువురు బీజేపీ సీనియర్‌ నేతలతో కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనాతో పాటు తదితరులతో దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే తాలిబన్‌ హుస్సేన్‌ విషయంపై బీజేపీ భిన్నంగా స్పందించింది.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ పరిశీలన లేకుండా పార్టీలో చేర్చుకునే ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు వ్యవస్థతో ఈ తప్పిదం జరిగిందని.. ఇదొక కుట్ర అని చెప్పుకొచ్చింది. అయితే పార్టీ సభ్యత్వం వరకు బీజేపీ చెప్పినదాంట్లో ఏకిభవించచ్చు కానీ.. ఐటీ సెల్‌ ఇన్‌చార్జిగా ఆయన్ను నియమించడం కూడా తెలియకుండా జరిగిపోయిందా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ చెయకుండా అలాంటి పదవులు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు.