సాలోంకో హాస్టల్ మే గుస్‌కే తోడే : JNUలో దాడి చేసింది వీరేనా 

  • Published By: madhu ,Published On : January 6, 2020 / 09:19 AM IST
సాలోంకో హాస్టల్ మే గుస్‌కే తోడే : JNUలో దాడి చేసింది వీరేనా 

JNU విశ్వవిద్యాలయంలో జరిగిన దాడి ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే..సోషల్ మీడియాలో వాట్సప్ గ్రూప్‌కు సంబంధించిన మెసేజ్‌లు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వీరు చేసిన ఛాటింగ్‌తో దాడి చేసింది వీరేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీకి అనుబంధ విద్యార్థి సంఘమైన ABVP వారు పాల్పడ్డారని కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే..తాము దాడులకు పాల్పడలేదని..వామపక్ష విద్యార్థులే పాల్పడ్డారని ఏబీవీపీ నాయకులు ప్రత్యారోపణలు చేస్తున్నరు. 

JNU
ఇదిలా ఉంచితే…2020, జనవరి 05వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాట్సాప్ సందేశాలను Scroll.in ట్రూ కాలర్ ఆప్‌ను ఉపయోగించి..ఫోన్ నెంబర్లను ఐడెంటీఫై చేసింది. వాటిని ఫేస్ బుక్‌లో పరిశోధించాక..వారి ప్రోఫైల్ విరాలు వెలుగులోకి వచ్చాయి. సాలోంకో హాస్టల్ మే గుస్‌కే తోడే..అనే ఓ వాట్సాప్ గ్రూప్‌లో నుంచి సందేశం కనిపించింది. దీనికి ప్రతిగా అవును..వారితో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది..అంటూ మరొకరు మెసేజ్ చేశారు. మొదట పంపించిన వ్యక్తి సౌరవ్ దూబే అని తేలింది. ఇతను ఢిల్లీలోని షహీద్ భగత్ సింగ్ ఈవెనింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా ఉన్నారు.

 

ఇతను “JNUites for MODI” అనే గ్రూపును నడుపుతున్నాడు. దాడికి ఘటనకు ముందు 5.39 గంటలకు Friends of RSS అనే వాట్సాప్ గ్రూప్ నుంచి దయచేసి గ్రూపులో చేరండి..వారిని చితకబాదాల్సిందే..వారికి సరైన చికిత్స అని ఒకరు మెసేజ్ చేయగా..గెట్ ది పీపుల్ ఫ్రమ్ డీయూ టూ ఎంటర్ ఫ్రమ్ ఖాజన్ సింగ్ స్విమ్మింగ్ సైడ్..వియ్ ఆర్ 25, 30 ఆఫ్ అజ్ ఇయర్ అని మరొకరు చేశారు. (డీయూ అంటే ఢిల్లీ యూనివర్సిటీ, ఖాజన్ సింగ్ స్విమ్మింగ్ సైడ్ అంటే జేఎన్‌యూలో ఖాజన్ స్విమ్మింగ్ అకాడమీ ఉంది.) స్విమ్మింగ్ అకాడమీ గేట్ నుంచి వెళితే..పెద్ద సమస్య ఉండదని భావించి..దుండగులు వెళ్లి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఈ సందేశం పంపింది ట్రూ కాలర్ యాప్ ద్వారా వికాస్ పటేల్‌దని తేలింది. ఫేస్ బుక్ ప్రోఫెల్ ప్రకారం వికాస్ పటేల్ ABVP ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు. JNUలో ABVP మాజీ ఉపాధ్యక్షుడు.