JNU అధికారులతో MHRD మీటింగ్

  • Published By: madhu ,Published On : January 6, 2020 / 08:21 AM IST
JNU అధికారులతో MHRD మీటింగ్

ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో విద్యార్థులపై జరిగిన దాడిని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (MHRD) తీవ్రంగా ఖండించింది. దీనిని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. వెంటనే దీనిపై మీటింగ్ ఏర్పాటు చేసింది. జేఎన్‌యూ రిజిస్ట్రార్, ప్రోక్టర్, రెక్టర్‌ని కార్యాలయానికి రావాలని MHRD కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. విశ్వవిద్యాలయంలో హింస జరగడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు జేఎన్‌యూ చీఫ్ ప్రోక్టర్ ధనుంజయ్ సింగ్. వెంటనే దీనిపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఘటనపై చర్చించడం జరుగుతుందన్నారు. 

మరోవైపు జేఎన్‌‌‌యూ జరిగిన రాక్షసకాండపై రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన వారు ఖండిస్తున్నారు. దేశంలో అశాంతి, హింసను సృష్టించాలని అనుకుంటున్న వారే చేశారని కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైన న్యాయ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత మాయావతి డిమాండ్ చేశారు. 

 

Read More : JNUలో ఉండాలంటేనే భయమేస్తోంది అందుకే వెళ్లిపోతున్నా : PHD స్టూడెంట్ 

2020, జనవరి 05వ తేదీ ఆదివారం అర్ధరాత్రి ముసుగులు ధరించిన దుండుగులు JNU విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. వసతి గృహాల్లోని అద్దాలు, ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో బీభత్సం సృష్టించారు. తలలు పగిలి రక్తపు మడుగులో కిందపడిపోయారు. మొత్తం 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.