JNU వైస్ ఛాన్స్‌లర్‌ను తొలగించాల్సిందే – మురళీ మనోహర్ జోషి

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 01:58 PM IST
JNU వైస్ ఛాన్స్‌లర్‌ను తొలగించాల్సిందే – మురళీ మనోహర్ జోషి

జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌లర్‌ను తొలగించాల్సిందేనంటున్నరు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. 2020, జనవరి 09వ తేదీ గురువారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారాయన. అధ్యాపకులు, స్టూడెంట్స్‌తో వీసీ చర్చించాలన్నారు. కానీ..ప్రభుత్వం ప్రపోజల్స్‌ని ఆచరణలో పెట్టడం లేదని తెలిపారు. దీనిని బట్టి..వీసీ ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని వెల్లడించారు. 

ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొన్నో రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీసీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే..కేంద్రం తీసుకొచ్చిన NRC, CAAకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనూహ్యంగా 50మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు, కర్రలు, హాకీ స్టిక్స్ చేతబట్టుకుని 2020, జనవరి 05వ తేదీ ఆదివారం రాత్రి JNU క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడడం ఉధృతం మరింత తీవ్రరూపం దాల్చింది.

Read More : అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా బాబు సవాల్

సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి హిందూ రక్షా దళ్ బాధ్యతను ప్రకటించుకుంది. తాజాగా మురళీ మనోహర్ జోషి చేసిన ట్వీట్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.