Prasar Bharati : ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీ

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ ఖాళీలు 6భర్తీ చేయనుండగా దీనికిగాను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. హిందీ తెలిసి ఉండాలి.

10TV Telugu News

Prasar Bharati : భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌క్యాస్టర్ ప్రసార భారతి పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకు 2022జనవరి 20 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు డీడీ కిసాన్ ఛానల్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి.

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ ఖాళీలు 6భర్తీ చేయనుండగా దీనికిగాను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 35 ఏళ్ల లోపు వారు అర్హులు. నెలకు వేతనంగా రూ.35,000 నుంచి రూ.40,000 రూపాయలు చెల్లిస్తారు.

సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ ఖాళీలు 6 భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆరేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 50 ఏళ్ల లోపు వారు అర్హులు. నెలకు వేతనం రూ.50,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్:https://applications.prasarbharati.org/

×