Rcil Jobs : ఆర్సిఐఎల్ లో ఉద్యోగాల భర్తీ

పోస్టుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి డిప్యూటీ మేనేజర్ 52 ఖాళీలు, మేనేజర్ 10 ఖాళీలు, సీనియర్ మేనేజర్ 7 ఖాళీలు ఉన్నాయి.

Rcil Jobs : ఆర్సిఐఎల్ లో ఉద్యోగాల భర్తీ

Rcil Jobs

Rcil Jobs : రైల్ టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్ తదితర విభాగాల్లో డిపార్ట్ మెంటల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి డిప్యూటీ మేనేజర్ 52 ఖాళీలు, మేనేజర్ 10 ఖాళీలు, సీనియర్ మేనేజర్ 7 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీగానీ, ఇంజనీరింగ్ కాని ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ, మార్కెటింగ్, టెలికమ్, ఐటీలో పీజీ డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ ఎల్ బీ, పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 21 ఏళ్ల నుండి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్య్వూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలి. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 23, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://railtel.cbtexam.in/