Jobs : ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్ధల్లో ఉద్యోగాలు

ఆయా పోస్టులను అనుసరించి మూడు దశల్లో కంప్యూటర్ విధానంలో రాత పరీక్ష, డిస్క్రప్టివ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

Jobs : ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్ధల్లో ఉద్యోగాలు

Ssc Jobs

Jobs : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు ట్రైబ్యునళ్లు తదితర సంస్ధల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్వీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఆయా పోస్టులను అనుసరించి మూడు దశల్లో కంప్యూటర్ విధానంలో రాత పరీక్ష, డిస్క్రప్టివ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన పోస్టును అనుసరించి వేతనం చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా 100రూపాయలు చెల్లించాల్సి ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది మార్చి 7, 2022, మే మాసంలో ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి విరాలకు వెబ్ సైట్ www.ssc.nic.in