Jammu Kashmir Houses Cracks : బాబోయ్.. జమ్ముకశ్మీర్‌లోనూ డేంజర్ బెల్స్, జోషిమఠ్ తరహాలో ఇళ్లకు పగుళ్లు, అసలేం జరుగుతోంది?
జమ్ముకశ్మీర్ లోనూ కలకలం రేగింది. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని కంగారుపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జమ్ముకశ్మీర్ లోనూ.. ఉత్తరాఖండ్ జోషిమఠ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి.

Jammu Kashmir Houses Cracks : జమ్ముకశ్మీర్ లోనూ కలకలం రేగింది. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని కంగారుపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జమ్ముకశ్మీర్ లోనూ.. ఉత్తరాఖండ్ జోషిమఠ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి.
దోడా జిల్లాలో పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. థాత్రి పట్టణంలోని ఓ బస్తీలో ఆరు ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన యజమానులు ఇళ్లను ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న జియాలజిస్టులు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇళ్లకు పగుళ్లు రావడానికి వెనుక గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..Joshimath sinking : విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్..: ప్రకటించిన కలెక్టర్
దోడా జిల్లాలోని ఓ గ్రామంలో భూమి కుంగిపోతోంది. 20కి పైగా ఇళ్లకు, ఓ మసీదు భవనానికి పగుళ్లు వచ్చాయి. ఈ పరిణామంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా స్థానికులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిపుణులను ఆ గ్రామానికి పంపారు.
Also Read.. Uttarakhand: డేంజర్ జోన్‌లో జోషిమఠ్ .. ఇస్రో శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలు విడుదల
భూమి కుంగడానికి, ఇళ్లకు పగుళ్లు రావడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు. స్థానికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డోడా జిల్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. నాయి బస్తీ గ్రామంలో 50 వరకు ఇళ్లు ఉన్నట్టు చెప్పారు. పగుళ్లు వచ్చిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, భూమి కుంగడానికి కారణాలపై దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. రోడ్ల నిర్మాణం, నీటిని అడ్డుకోవడం వంటి కారణాలు కొండ గ్రామంలో భూమి కుంగడానికి కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.