Joshimath: జోషిమఠ్‌లో కొనసాగుతున్న కూల్చివేతలు.. 863 భవనాలకు పగుళ్లు.. ప్రమాదకరంగా 181 ఇళ్లు

జోషిమఠ్‌లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Joshimath: జోషిమఠ్‌లో కొనసాగుతున్న కూల్చివేతలు.. 863 భవనాలకు పగుళ్లు.. ప్రమాదకరంగా 181 ఇళ్లు

Joshimath: ఉత్తరాఖండ్, చమోలి జిల్లా, జోషిమఠ్‌లో భూమి కుంగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఇండ్లకు పగుళ్లు ఏర్పడి, ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ ఇండ్లు కూలిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ ఇండ్లను అధికారులతో కలిసి జిల్లా మెజిస్ట్రేట్ (డీఎమ్) స్వయంగా పరిశీలించారు.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

జోషిమఠ్‌లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కూల్చివేత మొదలైంది. అయితే శుక్రవారం అక్కడ మంచు, వర్షం కురిసిన కారణంగా కూల్చివేతలకు ఆటంకం ఏర్పడింది. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలు నిలిపివేశారు. శనివారం పరిస్థితి చక్కబడటంతో కూల్చివేతల కార్యక్రమం తిరిగి మొదలైంది. ఇక్కడి ఇండ్లు కూల్చివేస్తున్న అధికారులు, అక్కడ నివసించే వాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులు, స్థానికులకు మరో చోట వసతి ఏర్పాట్లు కల్పిస్తున్నారు.

PM Modi: మోదీ అధ్యక్షతన 29న కేంద్ర క్యాబినెట్‌ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ

ఈ విషయంలో స్థానికుల సూచనలు తీసుకుని, వారికి తగిన నివాస ఏర్పాట్లు చేయాల్సిందిగా డీఎమ్ అధికారులను ఆదేశించారు. 2018 నుంచి జోషిమఠ్‌లో భూమి ప్రతి సంవత్సరం 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వచ్చింది. మరోవైపు రాబోయే నాలుగైదు రోజులు మరింతగా వర్షం కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. ఇప్పటివరకు 269 కుటుంబాలకు చెందిన 900 మంది నిరాశ్రయులుకాగా, వారికి ప్రభుత్వం రూ.3.27 కోట్ల మొత్తాన్ని సాయంగా అందజేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిని సమీక్షిస్తోంది.