నిరసన వైవిధ్యం : బీజేపీ ఆఫీసుకి హెల్మెట్లతో జర్నలిస్టులు

రాయ్‌పూర్ : ఏదైనా ప్రెస్ మీట్ అంటే మీడియా వాళ్లు ఎలా వస్తారు. కెమెరాలు, మైకులు, పెన్నులు, పేపర్లతో

నిరసన వైవిధ్యం : బీజేపీ ఆఫీసుకి హెల్మెట్లతో జర్నలిస్టులు

రాయ్‌పూర్ : ఏదైనా ప్రెస్ మీట్ అంటే మీడియా వాళ్లు ఎలా వస్తారు. కెమెరాలు, మైకులు, పెన్నులు, పేపర్లతో

రాయ్‌పూర్ : ఏదైనా ప్రెస్ మీట్ అంటే మీడియా వాళ్లు ఎలా వస్తారు. కెమెరాలు, మైకులు, పెన్నులు, పేపర్లతో వస్తారు. ఇది కామన్. కానీ హెల్మెట్లు ధరించి జర్నలిస్టులు మీడియా సమావేశానికి  రావడం చూశారా. కనీసం విన్నారా. అదే జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నిర్వహించిన ప్రెస్ మీట్‌కి జర్నలిస్టులు మైక్‌, కెమెరాలతో పాటు  హెల్మెట్లు ధరించి వచ్చారు. 600 మీడియా ప్రతినిధులు ఇలా హెల్మెట్లు ధరించి వచ్చారు. బీజేపీ ఆఫీస్ ముందు ఆందోళన కూడా చేశారు.

 

ఎందుకిలా హెల్మెట్లు వేసుకుని వచ్చారు అంటే.. ఇటీవల కొందరు బీజేపీ నేతలు ఓ జర్నలిస్టుపై దాడి చేశాడని, ఆ ఘటనకు నిరసనగానే తామంతా ఇలా హెల్మెట్లు ధరించి వచ్చామని వారు  తెలిపారు. రాయ్‌పూర్‌లో స్థానిక బీజేపీ ఆఫీస్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశానికి జర్నలిస్టులు హెల్మెట్లు పెట్టుకుని వచి తమ నిరసన తెలిపారు. బీజేపీ నేతలు మళ్లీ మాపై దాడి చేసినా హాని  జరగకుండా ఉండేందుకు ఇలా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వారు వివరించారు. పార్టీ కార్యాలయం ముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. మాకు రక్షణ కల్పించండి అంటూ స్లోగన్స్ చేశారు.

 

2019 ఫిబ్రవరి 2వ తేదీ శనివారం ఓ మీడియా సమావేశంలో జర్నలిస్టు సుమన్‌ పాండేపై కొందరు బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు.  ఈ ఘటనలో అతడి తలకి గాయమైంది. సమావేశాన్ని  ఫోన్లలో రికార్డు చేస్తుండగా కొందరు బీజేపీ నేతల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. అది కూడా ఫోన్లలో రికార్డ్ అయ్యింది. దాన్ని డిలీట్ చేయాలని వారు తనపై ఒత్తిడి తెచ్చారని పాండే  తెలిపారు. అందుకు తాను అంగీకరించకపోవడంతో తనపై దాడి చేసి బలవంతంగా వీడియోను తొలగించారని సుమన్‌ పాండే వాపోయారు. బీజేపీ నేతల రౌడీయిజంపై జర్నలిస్టులు ఫైర్ అయ్యారు.  వారికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పాండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన బీజేపీ నేతలను అరెస్టు  చేశారు. భవిష్యత్తులో తమపై ఇలాంటి దాడులు జరక్కుండా తమకు భద్రత కల్పించాలని జర్నలిస్టులు పోలీసులను డిమాండ్ చేశారు.