మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2019 / 10:17 AM IST
మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్

పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి  హాజరవ్వాలని ప్రియారమణికి  జడ్జి సూచించారు. 

మీ టూ ఉద్యమ సమయంలో మాజీ కేంద్రమంత్రి ఎమ్ జె అక్బర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వారిలో ప్రియారమణి కూడా ఒకరు. మీటూ ఆరోపణలు రావడంతో 2018 అక్టోబర్ 17న కేంద్రమంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అక్బర్ రాజీనామా చేసిన రోజు ప్రియారమణి ఓ ట్వీట్ చేస్తూ.. అక్బర్ రాజీనామాతో ఓ మహిళగా విడుదల లభించినట్లుగా మేం ఫీల్ అవుతున్నాం. కోర్టులో నాకు న్యాయం జరిగే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని ట్వీట్ చేసింది. 
Read Also: మిస్టరీ ఉందా : మలయాళ దర్శకురాలు నయన్ మృతి

తనపై అసత్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి తన పరువు తీసిందంటూ  అక్బర్… ప్రియారమణిపై పరువు నష్టం దావా వేశారు. అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆమెకు సమన్లు జారీ చేశారు. తమ వైపు స్టోరీ చెప్పే రోజు వస్తుందని సమన్లు అందుకున్న రమణి మరో ట్వీట్ చేశారు.
Read Also: ఎందుకు చనిపోతున్నారు : కర్నూలు రైతులతో రేణుదేశాయ్