Bihar: కోర్టులో ఒక అధికారికి దారుణ అవమానం.. రిజర్వేషన్ మీద వచ్చారా అంటూ ప్రశ్నించిన జడ్జి, హేళనగా మాట్లాడిన లాయర్లు

అధికారి సానుకూలంగా సమాధానం ఇచ్చి కోర్టు నుంచి బయటికి వెళ్తుండగా, అదే జడ్జీ మరోసారి కలుగజేసుకుని "సమాజ్ గయే నామ్ సే (పేరు చూస్తే అర్థమైంది)" అని అన్నారు. భారతి బయటకు వెళ్తుండగా కొంతమంది న్యాయవాదులు నవ్వుతూ ఎగతాళి చేశారు. "అబ్ తో హుజూర్ సమజియేగా బాత్ (ప్రభువుకు ఇప్పటికైనా విషయం అర్థమవుతుంది)" అని ఒక న్యాయవాది అన్నారు

Bihar: కోర్టులో ఒక అధికారికి దారుణ అవమానం.. రిజర్వేషన్ మీద వచ్చారా అంటూ ప్రశ్నించిన జడ్జి, హేళనగా మాట్లాడిన లాయర్లు

Bihar: కోర్టులు రాజ్యాంగబద్ధంగా పని చేస్తాయంటారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకే కోర్టులున్నాయంటారు. ఇందులో నిజం లేకపోలేదు, అలా అని అబద్ధమూ లేకపోలేదు. కోర్టుల్లో కూడా కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరుగుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు కూడా తప్పులు చేస్తారని పాట్నా కోర్టు జడ్జి నిరూపించారు. ఒక అధికారిని ‘‘రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించావా?’’ అంటూ ప్రశ్నించారు సదరు జడ్జి. రాజ్యాంగానికి రక్షణ కవచంలా ఉన్న కోర్టులోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొన్న దారుణ అవమానమిది.

నవంబర్ 23న కోర్టు వాదనల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జస్టిస్ సందీప్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. జడ్జీ అలా అడగ్గానే అక్కడున్న లాయర్లు నవ్వడం మరొక దారుణం. కోర్టు లైవులో భాగంగా ఇది రికార్డైంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు జడ్జీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

MCD Polls: కాంగ్రెస్ మరీ ఇంతలానా? ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పత్తాలేని హస్తం పార్టీ

జిల్లా భూసేకరణ అధికారి అరవింద్‌కుమార్‌ భారతి అనే వ్యక్తికి సంబంధించిన కేసును పాట్నా కోర్టు విచారిస్తోంది. ప్లాట్లు చట్టబద్ధంగా లాక్ చేయబడినప్పటికీ, కొందరికి పరిహారం విడుదల చేసిన విషయమై కోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. విచారణ అనంతరం కేసు విచారణను వాయిదా వేస్తూ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు న్యాయమూర్తి గడువు ఇచ్చారు. ఆ సమయంలోనే జస్టిస్ కుమార్ హిందీలో మాట్లాడుతూ “భారతీ జీ, రిజర్వేషన్ పర్ ఆయే ది నౌక్రీ మే క్యా? (భారతీజీ, మీరు ఈ ఉద్యోగంలోకి రిజర్వేషన్ ద్వారా వచ్చారా?)” అని వ్యాఖ్యానించారు.

China Protest: కొవిడ్ లాక్‭డౌన్‭పై చైనీయుల చారిత్రక ఆందోళన వృధాయేనా? తగ్గినట్టే తగ్గి కంచెలు బిగుస్తోన్న జిన్‭పింగ్ సర్కార్

అధికారి సానుకూలంగా సమాధానం ఇచ్చి కోర్టు నుంచి బయటికి వెళ్తుండగా, అదే జడ్జీ మరోసారి కలుగజేసుకుని “సమాజ్ గయే నామ్ సే (పేరు చూస్తే అర్థమైంది)” అని అన్నారు. భారతి బయటకు వెళ్తుండగా కొంతమంది న్యాయవాదులు నవ్వుతూ ఎగతాళి చేశారు. “అబ్ తో హుజూర్ సమజియేగా బాత్ (ప్రభువుకు ఇప్పటికైనా విషయం అర్థమవుతుంది)” అని ఒక న్యాయవాది అన్నారు. ఆ జడ్జీ మళ్లీ కలుగజేసుకుని “నహీ, నహీ, యే సబ్… కుచ్ నహీ హోతా ఇన్ లోగోన్ కా..యే బేచారా పైసా జో కామయా హోగా ఖతం కర్ దియా హోగా (లేదు, లేదు, ఈ వ్యక్తులకు ఏమీ జరగదు. ఈ పేద వ్యక్తి ఏమైనా సంపాదించి ఉంటే, ఇప్పటికే అది అయిపోవచ్చు)’’ అని అన్నారు.

ప్రజాస్వామ్య మూడో మూల స్థంభమైన కోర్టులో ఒక ప్రభుత్వ అధికారికి ఇంతటి అవమానం జరగడంపై దేశ నలుమూలల నుంచి విమర్శలు వస్తున్నాయి. సదరు జడ్జీ సహా, ఇతర లాయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.