అయోధ్య తీర్పు.. రైల్వే శాఖ అలర్ట్: స్టేషన్లలో హై సెక్యూరిటీ

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 04:48 AM IST
అయోధ్య తీర్పు.. రైల్వే శాఖ అలర్ట్: స్టేషన్లలో హై సెక్యూరిటీ

వివాదాస్ప రామ జన్మభూమి అయోధ్య తీర్పు వెలువడనున్న  క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు  పలు  అన్ని స్టేషన్లలోను.. రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. . ప్రతీ ప్రయాణీకుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. 

ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే యూపీలోని మురాదాబాద్ రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అనుమానితులపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తున్నారు. అత్యంత సున్నిత ప్రాంతాలుగా పరిగణించే గజియాబాద్, సహరన్‌పూర్ రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లలో పుకార్లు సృష్టించేవారిపై అధికారులు ప్రత్యేక  నిఘాపెట్టారు.  ప్రయాణికులు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. అటువంటివి మీ దృష్టికి వస్తే వెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని సూచించారు. 

అయోధ్య  తీర్పు రానున్న క్రమంలో గత వారం రోజుల క్రితమే అధికారులు ఏడు పేజీలతో కూడిన సూచలను అన్ని రైల్వే స్టేషన్లకు రైల్వే శాఖ జారీ చేసింది. ప్లాట్‌ఫాంలు, రైల్వే స్టేషన్లు, పార్కింగ్ స్థలం, ఫుట్ పాత్ లతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలలో భద్రతను పటిష్టంచేశారు.  ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే అప్రమత్తమై వారికి అదుపులోకి తీసుకోవాలని సూచించారు.