GST : జులైలో జీఎస్టీ ఆదాయం రూ.1.16లక్షల కోట్లు

జులైకి ల‌క్షా 16 వేల కోట్ల రూపాయ‌ల మేర జీఎస్టీ వ‌సూలైన‌ట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్ర‌క‌టించింది. 2020 జులైతో పోల్చితే 33 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపింది. ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా కోలుకుంటోంద‌నేందుకు ఇదే సంకేత‌మ‌ని ఆర్థిక శాఖ అభిప్రాయ‌పడింది. 2020 సంవత్సరం జూలైలో జీఎస్టీ ద్వారా రూ. 87,422 కోట్లు కాగా.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లు వచ్చింది.

GST : జులైలో జీఎస్టీ ఆదాయం రూ.1.16లక్షల కోట్లు

Gst (2)

GST : 2021 జులైకి ల‌క్షా 16 వేల కోట్ల రూపాయ‌ల మేర జీఎస్టీ వ‌సూలైన‌ట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్ర‌క‌టించింది. 2020 జులైతో పోల్చితే 33 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపింది. ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా కోలుకుంటోంద‌నేందుకు ఇదే సంకేత‌మ‌ని ఆర్థిక శాఖ అభిప్రాయ‌పడింది. 2020 సంవత్సరం జూలైలో జీఎస్టీ ద్వారా రూ. 87,422 కోట్లు కాగా.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లు వచ్చింది. జూలైలో ఆదాయం రూ.1,16,393కోట్లకు పెరిగింది.

ఈ మొత్తంలో కేంద్ర జీఎస్టీ రూ. 22 వేల 197 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ.28 వేల 541 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.57 వేల 864 కోట్లు ఉన్న‌ట్టు వెల్ల‌డించింది. దిగుమ‌తి చేసుకున్న వ‌స్తువుల‌తో క‌లిపి 7 వేల 790 కోట్ల సెజ్ వ‌సూలైన‌ట్టు తెలిపింది. రాబోవు నెల‌ల్లో కూడా అత్య‌ధిక జీఎస్టీ వ‌సూల‌వుతుంద‌ని, కేంద్ర ఆర్థిక శాఖ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఆశాభావం వ్యక్తం చేసింది.

వరుసగా ఎనిమిది నెలలు పాటు రూ.లక్ష కోట్లకుపైగా వచ్చిన జీఎస్టీ ఆదాయం గత జూన్‌లో రూ.లక్ష కోట్లకు దిగువకు పడిపోయింది. మే మాసంలో చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నాయి, ఈ నేపథ్యంలోనే జీఎస్టీ రాబడి తగ్గినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంక్షలు తొలగించడంతో ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుంది.