Nariman vs Rijiju: న్యాయశాఖమంత్రి రిజుజుపై విరుచుకుపడ్డ జస్టిస్ నారిమన్

న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని నారిమన్ పిలుపునిచ్చారు. ‘‘ఫలానా కొలీజియం రావాలని, అది వస్తే దాని మనసు మార్చుకుంటుందని మీరు ఎదురు చూస్తున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు.

Nariman vs Rijiju: చాలా రోజులుగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ కొనసాగుతోంది. న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. ఇదే సమయంలో కొలీజియం వ్యవస్థకు సుప్రీంకోర్టు అండగా నిలుస్తోంది. కొలీజియం వ్యవస్థపై సమయం దొరికినప్పుడల్లా విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. కాగా రిజుజు తీరుపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రొహింటన్ ఫాలి నారిమన్ విరుచుకుపడ్డారు.

Uddhav Sena: ములాయంకు పద్మ అవార్డు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉద్ధవ్ సేన.. బాల్ థాకరే, సావర్కర్‭లకు మరిచారంటూ ఆగ్రహం

న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫారసులను ఆమోదించడంపై ఎటూ తేల్చకుండా ఆలస్యం చేస్తుండడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని హెచ్చరించారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే చిట్టచివరి దుర్గం పతనమైతే, దేశం నూతన చీకటి యుగ అగాధంలోకి ప్రవేశిస్తుందని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ముంబై విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నారిమన్ మాట్లాడుతూ, స్వతంత్ర, నిర్భయ న్యాయమూర్తుల నియామకం జరగకపోతే న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే, దానికి ఆ ఉప్పదనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలని సామాన్యుడు ప్రశ్నించుకుంటాడదన్నారు.

Ramcharitmanas: విపక్షాల డిమాండ్లను తలకిందులు చేస్తూ మౌర్యకు మద్దతు ఇచ్చిన అఖిలేష్!

న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని నారిమన్ పిలుపునిచ్చారు. ‘‘ఫలానా కొలీజియం రావాలని, అది వస్తే దాని మనసు మార్చుకుంటుందని మీరు ఎదురు చూస్తున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. సమంజసమైన సమయంలో న్యాయమూర్తుల నియామకం తప్పనిసరిగా జరగాలని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు