కేంద్ర కేబినెట్‌లోకి జ్యోతిరాదిత్య సింధియా?!: ఉత్కంఠగా మధ్యప్రదేశ్ రాజకీయం!!

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 07:23 AM IST
కేంద్ర కేబినెట్‌లోకి జ్యోతిరాదిత్య సింధియా?!: ఉత్కంఠగా మధ్యప్రదేశ్ రాజకీయం!!

కేంద్ర మంత్రి వర్గంలోకి జ్యోతిరాదిత్యసింధియా ఎంటర్ కానున్నారా?మధ్యప్రదేశ్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం జోతిరాదిత్యాను కేంద్ర కేబినెట్ లో కూర్చోబెడుతుందా? సీఎం కమల్‌నాథ్‌‌కు రెబల్ గా మారిన సింధియా 17మంది ఎమ్మెల్యేలతో సహా  ప్రభుత్వం నుంచి..పార్టీనుంచి తప్పుకోవటం..మంగళవారం (మార్చి 10,2020)న ప్రధాని మోడీతో భేటీ కావటం..సింధియాకు ప్రధాని మోడీ కేంద్రంలోకి తీసుకుంటాననే హామీ ఇచ్చినట్లుగా వస్తున్న సమాచారంతో నిజమేననిపిస్తోంది. దీంతో సింధియా కేంద్ర కేబినెట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మధ్యప్రదేశ్ లో అంతకంతకూ ముదురుతున్న రాజకీయం సంక్షోభంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్ తో మద్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. సింధియా ఎపిసోడ్ తో కాంగ్రెస్ లో చీలిక వచ్చింది. సింధియా మొత్తం 17మంది ఎమ్మెల్యేలతో జంప్ అయిపోయారు. ఆ ఎమ్మెల్యేలను ఓ చోట భద్రతతో దాచిపెట్టినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఆరుగురు మంత్రులతో పాటు 11మంది ఎమ్మెల్యేలు  మొత్తం 17మంది సింధియా క్యాంప్ రాజకీయల్లో ఉన్నారు. తరువాత సింధియా కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మోడీ సింధియాకు కేంద్ర ప్రభుత్వ మంత్రిగా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సింధియా కమలదళంలో చేరిపోవటం ఇంచుమించు ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. 

కాగా..గత కొంతకాలం నుంచి సింధియా కమలజపం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు..వంటి పలు విషయాల్లో బీజేపీకి సింధియా మద్దతు తెలిపారు. దీంట్లో అప్పట్లో కాంగ్రెస్ లో కలకలం రేపింది. దీన్ని కాంగ్రెస్ సీనియర్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలో జ్యోతిరాదిత్యసింధియా బీజేపీలో చేరబోతున్నట్లుగా దాదాపు ఖరారుకావటంతో మధ్యప్రదేశ్ రాజకీయల్లో పెను సంచలనంగా మారింది. ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇటువంటి పరిణామాలతో మధ్యప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. సీఎం కమల్ నాథ్ సీఎం పీఠం చేజారనుంది. ఇప్పటికే సింధియా క్యాంప్ లో ఆరుగురు మంత్రులతో పాటు 11మంది ఎమ్మెల్యేలు ఉండగా మరింతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సింధియా క్యాంప్ లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నాయి.  ఎవరి బలం ఎంతో నిరూపించుకునేందుకు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. 

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖచిత్రం గురించి..అక్కడ పీఠం గురించి జరుగుతున్న రాజకీయాలకు ఢిల్లీ వేదకగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సోనియాగాంధీ అత్యతవసరంగా సమావేశమయ్యారు. ఎంపీలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా మంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోడీని కలిసారు.మీకెంత మాకెంత అంటూ రాజకీయ బేరాలు చేసుకుంటున్నారు. 

మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభాన్ని బీజేపీ సరిగ్గా అందిపుచ్చుకుని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.కమల్ నాథ్ ప్రభుత్వం నుంచి విడిపోయిన ఎమ్మెల్యేలను తన ఖాతాలో వేసుకునేందుకు బేరసారాలు జరుపుతోంది.దీంట్లో భాగంగానే భోపాల్ లో బీజేపీ నాయకులు సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోతుందనీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన అధికారాన్ని నిలుపుకోలేని పరిస్థితులకు వచ్చింది.  15నెలల తరువాత కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. సొంతపార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా సీఎం కమల్ నాథ్ తో కత్తికట్టటంతో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. 17మంది ఎమ్మెల్యేలను తీసుకుని బెంగళూరుకు తరలించాడు. సీఎం పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సింధియా కమల్ నాథ్ పై అసంతృప్తిగా ఉన్నాడ. దీంతో  అదను చూసి కాంగ్రెస్ కు దెబ్బకొట్టాడు. 

2018 డిసెంబర్ లో జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ గెలుపు సాధించటంతో కీలక పాత్ర వహించారు. అలా అధికారంలోకి వచ్చాక సీఎం పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కానీ సీఎం పీఠం కమల్ నాథ్ కు దక్కింది. దీంతో సింధియా అసంతృప్తితోనే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.  కానీ రాహల్ గాంధీ సింధియాకు కీలక బాధ్యతలు అప్పగించినా అసంతృప్తి తగ్గలేదు. కమల్ నాథ్, సింధియాలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అవకాశం వచ్చినప్పుడల్లా కమల్ నాథ్ దళంపై సింధియా విరుచుకుపడుతునే ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు బహిరంగంగానే చేసేవారు సింధియా. ఈ క్రమంలో రాజ్యసభ సీటుపై ఆశపెట్టుకున్న సింధియాకు కాంగ్రెస్ మరోసారి అసంతృప్తిని మిగులుస్తూ..ఆయన వ్యతిరేక వర్గం ప్రియాంకాగాంధీని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని డిమాండ్ చేసింది. దీంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదను చూసి దెబ్బకొట్టారు. 

230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 114మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.బీజేపీకి 107మంది ఉన్నారు.నలుగురు ఇండిపెండెంట్ లు..ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ సభ్యులు ఉన్నారు. వీరు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేకీ సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించటంతో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.   ప్రస్తుతం మెజార్టీ మార్క్115గా ఉంది. దీంతో సింధియావైపు ఉన్న 17మంది ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. వారు ఏపార్టీ వైపు ఉంటే ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది. 

ఈ 17మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీలోకి వెళితే కాంగ్రెస్ బలం తగ్గిపోతుంది.  97కు పడిపోయి బలం తగ్గిపోతుంది. ఇండిపెండెంట్ లు..ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ సభ్యులు ఉన్నారు. వీరు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందకు సిద్ధంగా ఉండటంతో ప్రస్తుతం 104 గా ఉంది. కానీ అప్పటికే 107మంది సొంత సభ్యుల బలం ఉన్న బీజేపీ సింధియా వర్గంనుంచి ఉన్న 17మంది చేరితే బీజేపీ అత్యంత ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తుంది. ఈ క్రమంలో ఇలా వచ్చిన అవకాశాలన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకుని కాంగ్రెస్ కు చెక్ పెట్టి..మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ దళం యత్నిస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.