Kaali poster dispute: కాళీమాత పోస్టర్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు
కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన 'కాళి' అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దర్శకురాలు లీనా మణిమేకలైకు మద్దతుగా మాట్లాడారు.

Kaali poster dispute: కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ‘కాళి’ అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దర్శకురాలు లీనా మణిమేకలైకు మద్దతుగా మాట్లాడారు.
తనకు సంబంధించినంత వరకు కాళీకా మాత మాంసాహారం, మద్యం స్వీకరించే దేవతే అని ఆమె అన్నారు. మీ దేవతను ఊహించుకునే స్వేచ్ఛ మీకు ఉంది. నాకు కాళీ మాంసాహారం, మద్యం స్వీకరించే దేవత. కొన్ని ప్రదేశాల్లో మద్యాన్ని దేవతలకు నైవేద్యంగా పెడతారు. కానీ అది ఇతర ప్రదేశాల్లో దైవదూషణ అవుతుందని మోయిత్రా అన్నారు. మోయిత్రా వ్యాఖ్యలను టీఎంసీ అధిష్టానం స్పందించింది. మోయిత్రా చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అవి ఆమె వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు, అలాంటి వ్యాఖ్యలను ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.
TMC condemns its MP Mahua Moitra's comments on Goddess Kali says "not endorsed by the party." pic.twitter.com/BBQcg7tM23
— ANI (@ANI) July 5, 2022
మోయిత్రా వ్యాఖ్యలు వివాదంగా మారుతున్న క్రమంలో ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. నేను కాళికా మాతను కించపర్చలేదని, ఏ సినిమా పోస్టర్ కు మద్దతు ఇవ్వలేదని, అసలు స్మొకింగ్ అనే పదాన్ని ఉపయోగించలేదని అన్నారు.
To all you sanghis- lying will NOT make you better hindus.
I NEVER backed any film or poster or mentioned the word smoking.Suggest you visit my Maa Kali in Tarapith to see what food & drink is offered as bhog.
Joy Ma Tara— Mahua Moitra (@MahuaMoitra) July 5, 2022
ఇదిలాఉంటే కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ‘కాళి’ అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ చిత్ర నిర్మాత, అసోసియేట్ నిర్మాత, ఎడిటర్‌పై దేశంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం సినీ నిర్మాత లీనా మణిమేకలైతో పాటు మరో ఇద్దరిపై న్యాయవాది వేద్ ప్రకాష్ శుక్లా సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా యుపీ పోలీసులు హజరత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్ అశాంతికి దారితీస్తోందని, ఒక నిర్దిష్ట విశ్వాసం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.