MP Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. టీఎంసీ ఎంపీపై కేసు నమోదు

కాళీమాత‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మ‌హువా మైత్రిపై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో కేసు న‌మోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్ష‌న్ కింద ఈ కేసును రిజిస్ట‌ర్ చేశారు. మ‌త‌ప‌ర‌మైన భావాల‌ను కించ‌ప‌రిచిన‌ట్లు ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయని, హిందూ మ‌త‌స్థుల మ‌నోభావాల‌ను ఎంపీ మ‌హువా అవ‌మానించార‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

MP Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. టీఎంసీ ఎంపీపై కేసు నమోదు

Kaali

MP Mahua Moitra: ‘కాళి’ పేరుతో తెరకెక్కిస్తోన్న డాక్యుమెంటరీ సినిమాలో కాళి మాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు డైరెక్టర్ లీనా మణిమేకలై. ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి హిందూ సంఘాలు సదురు దర్శకుడి తీరుపై భగ్గు మంటున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో డైరెక్టర్ తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పోస్టర్ పై తృణముల్ ఎంపీ మహువా మైత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ’కాళి’ పోస్టర్ లో తప్పేముందంటూ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

‘Smoking Kaali’ : సిగిరెట్ తాగుతున్న కాళీమాత పోస్టర్..డైరెక్టర్ ని అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్

టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. పార్టీ అధికారిక ట్విటర్ లో ఎంపీ మహువా మైత్రిచేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని తెలిపింది. అనంతరం ఎంపీ తన అధికారిక ట్వీటర్ ద్వారా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను ఏ చిత్రానికి, ఏ పోస్టర్ కు మద్దతు ఇవ్వలేదని, తాను ధూమపానం అనే పదాన్ని వాడలేదని వివరణ ఇచ్చారు.  ఆమెను టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.

Kaali poster dispute: కాళీమాత పోస్టర్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు

అదేవిధంగా కాళీమాత‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మ‌హువా మైత్రిపై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో కేసు న‌మోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్ష‌న్ కింద ఈ కేసును రిజిస్ట‌ర్ చేశారు. మ‌త‌ప‌ర‌మైన భావాల‌ను కించ‌ప‌రిచిన‌ట్లు ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయని, హిందూ మ‌త‌స్థుల మ‌నోభావాల‌ను ఎంపీ మ‌హువా అవ‌మానించార‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హిందూ దేవ‌త‌ల్ని కించ‌ప‌ర‌చ‌డాన్ని ఎప్ప‌టికీ స‌హించ‌బోమ‌న్నారు.