Kamal Haasan: ‘భారత్ జోడో యాత్ర’లో చేరనున్న కమల్ హాసన్.. ఢిల్లీలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర

తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Kamal Haasan: ‘భారత్ జోడో యాత్ర’లో చేరనున్న కమల్ హాసన్.. ఢిల్లీలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర

Kamal Haasan: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర‘ చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ యాత్ర ఢిల్లీలో సాగనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొనబోతున్నాయి.

Nasal Vaccine: నేటి నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి.. అనుమతించిన కేంద్రం

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఎంపీలు, స్వాతంత్ర సమరయోధులు ఈ యాత్రలో పాల్గొనబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ఈ యాత్రలో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఎంకేఎం కార్యవర్గ సమావేశంలో కూడా కమల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తనకు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందిందని కమల్ చెప్పారు. ఈ నెల 24న ఢిల్లీలో జరిగే యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ కోరినట్లు తెలిపారు. దీంతో కమల్ ఈ యాత్రలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే, రాహుల్ గాంధీ-కమల్ హాసన్ కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

Covid-19: కోవిడ్ తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

శుక్రవారం జరిగే యాత్రలో దాదాపు 40,000-50,000 మంది పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తగిన ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలోకి యాత్ర చేరుకున్న తర్వాత యాత్రకు చిన్న విరామం ఇస్తారు. అనంతరం జనవరి 3 నుంచి రెండో దశ ‘భారత్ జోడో యాత్ర’ ఉత్తర ప్రదేశ్ నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇది పంజాబ్ మీదుగా జమ్ము-కాశ్మీర్ చేరుకుంటుంది.