Kamal Haasan: కోయంబత్తూరులో ఓడిపోయిన కమల్ హాసన్

Kamal Haasan: కోయంబత్తూరులో ఓడిపోయిన కమల్ హాసన్

Kamal Haasan Loses To Bjp Candidate Vanathi Srinivasan

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు (దక్షిణ) నియోజకవర్గంలో ఓటు లెక్కింపు ముగిసింది. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు.

లెక్కింపు ప్రారంభమైన మొదటి నుంచి కమల్ హాసన్ ముందంజలో ఉండగా.. సాయంత్రం 6 గంటలకు బిజెపికి చెందిన వనాతి శ్రీనివాసన్ 1000 ఓట్ల తేడాతో కమల్‌ను అధిగమించారు. చివరకు 1200 పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ గెలిచారు.

ఏప్రిల్ 6 న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో డీఎంకే స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. చివరి రౌండ్లలోకి వచ్చేనాటికి 156 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అధికార ఎఐఎడిఎంకే 78సీట్లతో వెనుకబడి ఉంది. 234మంది సభ్యుల తమిళనాడు అసెంబ్లీలో 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్.

ఈ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో 3,998 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. జయలలిత, కరుణానిధి ఇద్దరూ లేకుండా రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.