పార్టీకి విరుద్ధంగా వ్యవహరించొద్దు..లేకపోతే..పార్టీని ఎత్తేస్తా

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 12:08 PM IST
పార్టీకి విరుద్ధంగా వ్యవహరించొద్దు..లేకపోతే..పార్టీని ఎత్తేస్తా

పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తే..బాగుండదు..ఇలాగే చేస్తే మాత్రం పార్టీని పీకి పారేస్తానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.



కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ఓ హోటల్ లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కమల్ సమీక్షిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఇటీవలే పార్టీ జిల్లా, రాష్ట్ర నేతలతో ముఖ్యమైన అంశాలపై ఆయన సమీక్షిస్తున్నారు.

పార్టీ విధానాలు ప్రజల్లోకి చొచ్చుకు పోవాలంటే పూర్తి అవగాహన ఉండాలని, అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కమల్ వెల్లడించారు. చెన్నై పార్టీకి సంబంధించిన నిర్వాహకుల పనితీరుపై నిఘా పెట్టినట్లు, మీ కింద పనిచేసేవారికి విలువ ఇవ్వండని సూచించారు.



పార్టీ నిర్వహణలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదని, తన భవిష్యత్తును పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీని ప్రారంభించినపుడే స్పష్టం చేశా..అయితే నా మాటలను కొందరు హేళన చేయవచ్చు. అయినా ఇది సత్యంమన్నారు కమల్.

పొలిటికల్ ప్రయాణంలో నిర్వాహకుల వల్ల ఎదైనా ఆటకం కలిగితే తీవ్ర చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించడం విశేషం. తప్పుడు మార్గంలో పయనిస్తే పార్టీ ఎత్తేసి మరో మార్గంలో ప్రజాసేవ వైపు వెళ్లేందుకు కూడా వెనుకాడనంటూ కామెంట్స్ చేయడం పొలిటికల్ లో వేడి పుట్టించింది.



పార్టీ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు కమల్ తెలిపారు. ఈ సమావేశంలో మొత్తం 350 మంది నిర్వాహకులు పాల్గొన్నట్లు సమాచారం.