కమలా హారీస్ సంచలనం, తమిళనాడులో ముందే దీపావళి

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 07:24 AM IST
కమలా హారీస్ సంచలనం, తమిళనాడులో ముందే దీపావళి

Kamala Harris victory : కమలా హారీస్ … ఇప్పుడు అమెరికా లో ఆమె ఒక సంచలనం. వైట్‌వైస్‌లో అడుగుపెడుతున్న మొట్టమొదటి ఇండో ఆఫ్రికన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కమల చరిత్ర సృష్టించారు. అమెరికా ఉపాధ్యాక్షురాలిగా గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు కమలా హారిస్. జో బైడెన్‌ సంచలన విజయంలోనూ కీలక భూమిక పోషించారు. గతంలో కమలా హారిస్ అటార్నీ జనరల్ గా .. సెనెటర్ గా పనిచేసి ప్రజలు మన్ననలు పొందారు.



తమిళనాడులోని తులసేంద్రపురంలో దీపావళి ముందే వచ్చేసింది. అక్కడంతా సంబరాల వాతావరణం కనిపిస్తోంది. కమలా హర్రీస్ విజయంతో ఆలయాల్లో పూజలు జరిపి ఇళ్ల ముందు రంగవల్లులు వేశారు స్థానికులు. ఆమె మావూరి ఆడబిడ్డ అని చెప్పుకుంటూ పెద్దలు పిన్నలు మురిసిపోతున్నారు. కమలా హర్రీస్ కు ఇష్టమైన ఇడ్లి, సాంబారు ఆలయాల వద్ద పేదలకు పంచుతున్నారు.



తమిళనాడు తిరువారూర్ జిల్లా తులసేంద్రపురం ఆమె తల్లిగారి సొంతూరు. కమలా తాతగారు పీవీ గోపాలన్ మాజీ రాయబారి. కమలా తల్లి శ్యామల గోపాలన్. తండ్రి డోనాల్డ్ హరీస్. కమలా హరీస్ కాలిఫోర్నియాలో పుట్టారు. చిన్నతనంలో తన తల్లితో అమ్మమ్మవాళ్ల ఊరు వచ్చి గడిపేవారు కమలా హారిస్.



1964 అక్టోబర్ 20వ తేదీన ఒక్లాండ్ లో జన్మించారు.
తమిళనాడులోని సంప్రదాయ కుటుంబంలో ఆమె జన్మించారు. తండ్రి జమైకా దేశస్తుడు.
వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం.
యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు.
అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటర్నీ కార్యాలయంలో 8 సంవత్సరాలు పని చేశారు. చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను ఆమె విచారించారు.
డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్ గా ఎన్నికయ్యారు.