కాంగ్రెస్ పై కాంట్రవర్శీ క్వీన్ ఫైర్

కాంగ్రెస్ పై  కాంట్రవర్శీ క్వీన్ ఫైర్

కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్‌ (కాంగ్రెస్‌ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్‌ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్  లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్ ఇవాళ జరిగిన విషయం తెలిసిందే.
Also Read : అదృష్టం వెన్నంటే ఉంటే : రెండు బాంబు దాడుల నుంచి బతికి బయటపడ్డాడు

ముంబైలో ఓటు హక్కను వినియోగించుకున్న అనంతరం కంగన మీడియాతో మాట్లాడుతూ…ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఐదేళ్లకోసారి వచ్చే రోజు ఇది.కావున అందరూ సద్వినియోగం చేసుకోండి.నా ఉద్దేశంలో ఈరోజు భారత్‌ కు అసలైన స్వాతంత్ర్యం లభిస్తోంది.ఎందుకంటే..గతంలో మన దేశం మొఘల్‌, బ్రిటిష్‌, ఇటలీ ప్రభుత్వాల చేతుల్లో ఉండేది. భారతీయులు వారి చేతిలో బానిసలుగా బతికారు.

కాంగ్రెస్‌ పాలన సమయంలో చాలా మంది రాజకీయనేతలు లండన్‌ లో సేదతీరుతుండేవారు. మరోపక్క దేశంలో అత్యాచారాలు, పేదరికం, పొల్యూషన్ ఎక్కువైపోతుండేవి. ఇంతకంటే దారుణమైన స్థితిలో ఇక మన దేశం ఉండకూడదు. మన స్వరాజ్యాన్ని, స్వధర్మాన్ని కాపాడుకునే సమయమిది.ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలని కంగనా అన్నారు.
Also Read : గిఫ్ట్ విసిరికొట్టాడు : పక్కనే పెళ్లికూతురు.. PUBGతో పెళ్లికొడుకు ఫుల్ బిజీ