Kanhaiya, Jignesh : ఇదో పెద్ద షిప్..కాంగ్రెస్ లో చేరిన కన్నయ్య,జిగ్నేష్

ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Kanhaiya, Jignesh : ఇదో పెద్ద షిప్..కాంగ్రెస్ లో చేరిన కన్నయ్య,జిగ్నేష్

Congress (1)

Kanhaiya, Jignesh ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ ఇద్దరు యువనేతలు..ఇవాళ(సెప్టెంబర్-28,2021)మధ్యాహ్నాం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు,ఈ ఇరువురు యువ నేతలు ఇవాళ ఉదయం ఢిల్లీలోని షాహీద్ ఈ అజామ్ భగత్ సింగ్ పార్క్ లో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్‌ను కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ ‌రహే అంటూ నినాదాలు చేశారు.

ఇక,కాంగ్రెస్ లో చేరిన అనంతరం పార్టీ ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నయ్య,జిగ్నేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)కేసీ వేణుగోపాల్..ఈ ఇద్దరు నేతలకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరస్వాగతం పలికారు.  

కన్నయ్య కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ కేవలం పార్టీ కాదు. ఇదొక ఐడియా. పెద్ద ప్రజాస్వామ్య పార్టీ. అందుకే కాంగ్రెస్ లో చేరాను. కాంగ్రెస్ లేకుండా దేశం ముందుకెళ్లలేదు అని నేను ఒక్కడినే కాదు చాలామంది భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఓడ లాంటిది. అది సేవ్ చేయబడితే చాలా మంది ప్రజల ఆకాంక్షలు, మహాత్మా గాంధీ ఏకత్వం, భగత్ సింగ్ యొక్క ధైర్యం, అంబేద్కర్ సమానత్వం అనే ఆలోచన కూడా రక్షించబడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ దేశంలో విలువలు, సంస్కృతి, చరిత్ర మరియు భవిష్యత్తును నాశనం చేయడానికి ఒక భావజాలం ప్రయత్నిస్తోందని నేను భావిస్తున్నందున కాంగ్రెస్‌లో చేరుతున్నాను. కాంగ్రెస్‌ను రక్షించకుండా ఈ దేశాన్ని రక్షించలేమని కోట్లాది మంది యువకులు భావిస్తున్నారు అని కన్నయ్య కుమార్ తెలిపారు.

గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాన్ మాట్లాడుతూ..సాంకేతిక కారణాల వల్ల అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేకపోయారు. నేను ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, నేను ఒక పార్టీలో చేరితే, నేను ఎమ్మెల్యేగా కొనసాగకపోవచ్చు. నేను సైద్ధాంతికంగా కాంగ్రెస్‌లో భాగం, రాబోయే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు నుండి పోటీ చేస్తాను అని జిగ్నేష్ తెలిపారు.

ALSO READ  బెల్లం బాబు.. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్.. ‘సుఖీభవ.. సుఖీభవ’..

కాగా, కన్నయ్య కుమార్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సీపీఐలో చేరారు. బీహార్‌లోని తన హోమ్‌టౌన్ బెగుసరాయ్ నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. జిగ్నేష్ మేవాని గుజరాత్ ఎమ్మెల్యేగా వడ్గాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కన్నయ్య కుమార్, జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటాన్ని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ స్వాగతించారు. తామంతా యువకులమని, కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి, అభ్యుదయం కోసం పాటుపడే యువనేతతో కలిసి పనిచేస్తామని చెప్పారు. గతంలో కూడా తమ వాణిని వినిపించామని, మునుముందు కూడా మరింత బలంగా వినిపించనున్నామని చెప్పారు.