Piyush Jain: పీయూష్ జైన్ అరెస్ట్.. రూ.284 కోట్ల నగదు, 250 Kg వెండి, 25 KGల గోల్డ్ సీజ్

సమాజ్ వాదీ నేత, పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.రూ.284 కోట్ల నగదు, 250 Kg వెండి, 25 KGల బంగారం స్వాధీనం చేసుకున్నారు

Piyush Jain: పీయూష్ జైన్ అరెస్ట్.. రూ.284 కోట్ల నగదు, 250 Kg వెండి, 25 KGల గోల్డ్ సీజ్

Piyushjain Arrest (1)

Kanpur perfume trader Piyush Jain arrested recovery of Rs 284 crore : అది ఇల్లా..లేకా బంగారు ఖజానాయా? అది ఇల్లా లేక రిజర్వు బ్యాంకా? అనేలా ఉంది పన్నులు ఎగవేసి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సమాజ్ వాదీ (SP) పార్టీ నేత, కాన్పూర్ కు చెందిన పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇల్లు. ఇంటెలిజెన్స్ అధికారులు సోదాల్లో కరెన్సీ కట్టల గుట్టలే బయటపడుతున్నాయి.బంగారు ఖజానాయే బటయపడుతోంది.తవ్వేకొద్దీ వస్తున్నట్లుగా కరెన్సీ..బంగారం, వెండి తవ్వేకొద్ది లభిస్తున్నట్లుగా ఉంది. అధికారులు స్వాధీనం చేసుకున్న కరెన్సీ కట్టల్ని పేరిస్తే అదో రిజర్వు బ్యాంకా? అన్నట్లుగా ఉంది. ఈ అవినీతి కట్టల గురించి..బంగారు ఖజానీ గురించి అధికారులు ప్రశ్నిస్తుంటే జైన్ మాత్రం ఏమాత్రం నోరు మెదపటంలేదు. ఒక్కముక్క కూడా చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. జైన్ తో పాటు వారి బంధువుల ఇల్లు, కార్యాల్లో సోదాలు చేసిన అధికారులు రూ. 257 కోట్ల నగదు,ఇప్పటికే ఏకంగా 250 కిలోల వెండి, 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Read more : Hetero Pharma : హెటిరో ఫార్మా కార్యాలయాల్లో ఐటీ సోదాలు

పన్నులు ఎగవేసి..భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సమాజ్ వాదీ (SP) పార్టీ నేత, కాన్పూర్ కు చెందిన పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్ ఆదివారం (డిసెంబర్ 26,2021)రాత్రి 4 గంటలకు అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అవినీతి ఖజానా గురించి జైన్ ను ఎన్ని ప్రశ్నలు సంధించినా ఆయన దేనికి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తు అధికారులు సహనానికి పరీక్ష పెడుతున్నారు.

50 మంది అధికారుల బృందం గత శుక్రవారం (డిసెంబర్ 24,)నుంచి సోదాలు చేస్తున్న అధికారులు జైన్ తో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం తెలిసిందే. నాలుగవ రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జైన్ ను అరెస్ట్ చేసిన విచారిస్తున్నా ఏమాత్రం నోరు మెదపటంలేదు సరికదా..ఒకే ఒక్క డైలాగ్ చెబుతున్నారు జైన్. అదేమంటే ‘‘ఆ డబ్బంతా నాదే’’నని చెబుతున్నారు పీయూష్ జైన్. కాన్పూర్ లోని ఆనంద్ నగర్ లో ఉన్న జైన్ నివాసం నుంచి అధికారులు రూ.177 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కన్నౌజ్ లోని మరో ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.107 కోట్ల నగదు బయటపడింది. దీంతో మొత్తం రూ.288 కోట్ల కరెన్సీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read more : Wardrob Full Of Money : ఈ బీరువాల్లో ఉన్నవి బట్టలు కాదు..కరెన్సీ కట్టలు..

కానీ ఈ డబ్బంతా తనదేనంటున్నారు జైన్. తమ పూర్వీకుల నుంచి వచ్చిన 400 కిలోల బంగారాన్ని అమ్మితే వచ్చిందని చెబుతున్నారు. పైగా జైన్ అధికారులకు ఓ చక్కటి ఆఫర్ కూడా ఇచ్చారు. అదేమంటే ‘కావాలంటే ఈ మొత్తం నుంచి పన్నును మినహాయించుకుని మిగిలిందే నాకివ్వండి’ అంటూ కోరుతున్నారు. బంగారాన్ని ఎందుకు అమ్మాల్సి వచ్చిందని అధికారులు వేసిన ప్రశ్నకు ‘వ్యాపారంలో పెట్టుబడి అవసరమైందని అందుకే అమ్మానని చెబుతున్నారు. కానీ అవన్నీ అబద్ధాలేనని..ఐదేళ్లలో జైన్ కొత్తగా ఏ వ్యాపారము ప్రారంభించలేదని గుర్తించారు అధికారులు.

ఇప్పటికే జైన్ నుంచి 250 కిలోల వెండి, 25 కిలోల బంగారాన్ని కూడా కన్నౌజ్ లోని జైన్ నివాసం నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 9 డ్రమ్ముల గంధపు నూనె కూడా ఉందని అధికారులు తెలిపారు. జైన్ సమాజ్ వాదీ నేత కావడంతో ‘సమాజ్ వాదీ’ పేరుతో ఒక పెర్ ఫ్యూమ్ ను కూడా మార్కెట్లోకి గతంలో తీసుకువచ్చారు.