ఢిల్లీలో సీఏఏ హింస….కపిల్ మిశ్రా స్పీచ్ పై గంభీర్ అభ్యంతరం

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2020 / 09:49 AM IST
ఢిల్లీలో సీఏఏ హింస….కపిల్ మిశ్రా స్పీచ్ పై గంభీర్ అభ్యంతరం

రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆదివారం,సోమవారం ఇరువర్గాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారి  ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో ఒకరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఓ డీసీపీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టేశారు. 

ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక పరిస్థితికి బీజేపీ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రానే కారణమని ఊహాగానాలు వినిపిస్తోన్న క్రమంలో ఆ పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టంచేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వారు ఎవరైనా సంబంధం లేదని, చర్యలు తప్పవని గౌతం గంభీర్ స్పష్టంచేశారు. ఒకవేళ రెచ్చొగొట్టేలా కపిల్ మిశ్రా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. తమ పార్టీకి చెందినవారైనా సరై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఇందులో సందేహానికి తావులేదని క్లారిటీ ఇచ్చారు.

See Also>>ఢిల్లీలోనే ట్రంప్ : ఆగని సీఏఏ హింస…రాజ్ ఘాట్ దగ్గర కేజ్రీవాల్ మౌనదీక్ష

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తమ ఎమ్మెల్యేలతో సమావేశమై.. సమీక్షించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని, వారి సమస్యపై చర్చించేందుకు సిద్ధమని కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు జాఫ్రాబద్, మౌజ్‌పూర్-బాబర్‌పూర్, గోకుల్‌పురి, జాహ్రీ, శివ్ విహార్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందును అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించారు. మరోవైపు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు కొనసాగిస్తున్నారు.