Insaaf: ప్రభుత్వంపై న్యాయపోరాటానికి కపిల్ సిబాల్ నూతన వేదిక

బీజేపీ, ఆర్ఎస్ఎస్‭ల మీద సిబాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ శాఖలు తమ సిద్ధాంతాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున అన్యాయాలు జరుగుతున్నాయని సిబాల్ అన్నారు. ఇలాంటి సమస్యలపై కూడా తమ వేదిక పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Insaaf: ప్రభుత్వంపై న్యాయపోరాటానికి కపిల్ సిబాల్ నూతన వేదిక

Kapil Sibal announces new platform to fight injustice

Insaaf: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబాల్ నూతన వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఇన్సాఫ్’ పేరిట ఏర్పాటు చేయనున్న ఈ వేదిక ద్వారా మోదీ ప్రభుత్వంపై ఆయన న్యాయపోరాటం చేయనున్నారు. ఇందులో భాగంగా ‘ఇన్సాఫ్ కే సిపాహి’ పేరిట వెబ్‭సైట్‭ను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

విజయవంతమైన గ్లోబల్ ఇన్వెస్ట్‭మెంట్ సమ్మిట్.. ఏపీకి వెల్లువెత్తిన పెట్టుబడులు

ఈ వేదిక ద్వారా ప్రజల తరపున లాయర్లు పోరాటం చేస్తారని ఆయన తెలిపారు. ఈ వేదికకు మద్దతు ఇవ్వాలని దేశంలోని విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, నేతలను కోరారు. ఈ నెల 11న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి తాను ఏర్పాటు చేయనున్న వేదిక లక్ష్యాలను వివరించనున్నట్లు సిబాల్ పేర్కొన్నారు. అయితే దీన్ని తాను రాజకీయ కోణంలో పెట్టడం లేదని స్పష్టతనిచ్చారు. దీనికి జాతీయ స్థాయాలో మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Maharashtra : మహారాష్ట్రలో ఒక్కసారిగా బద్ధలైన నేల .. చీలిపోయి రోడ్డు..!!

ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్‭ల మీద సిబాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ శాఖలు తమ సిద్ధాంతాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున అన్యాయాలు జరుగుతున్నాయని సిబాల్ అన్నారు. ఇలాంటి సమస్యలపై కూడా తమ వేదిక పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.