Kapil Sibal: సుదీర్ఘకాలం అవే సిద్ధాంతాలంటే కష్టం.. కాంగ్రెస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పిన కపిల్ సిబల్..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం విధితమే. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కపిల్ సిబల్.. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు...

Kapil Sibal: సుదీర్ఘకాలం అవే సిద్ధాంతాలంటే కష్టం.. కాంగ్రెస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పిన కపిల్ సిబల్..

Kapil Sibal

Kapil Sibal: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం విధితమే. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కపిల్ సిబల్.. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు.. కానీ ప్రతిఒక్కరూ స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరమూ ఉందని కపిల్ సింబల్ పేర్కొన్నారు.

kapil sibal : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్..సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్

పార్లమెంట్ లో స్వతంత్రంగా గళం వినిపించాలనుకుంటున్నా.. ఏ పార్టీ కొర్రీలు తగిలించుకోవాలనుకోవట్లేదని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఓ పార్టీకి కట్టుబడి ఉండటం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం చాలా చాలా కష్టమైన విషయమంటూ ప్రస్తుతం తరుచుగా పార్టీలు మారుతున్న వారికి మద్దతుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రతీఒక్కరూ వాళ్లవాళ్ల గురించి ఆలోచించాలని, ఆ ఆచరణను అమలు చేయాలంటే కొత్తగా ఆలోచించాలని, అందుకే బయటకు రావాల్సి వచ్చిందంటూ కపిల్ సింబల్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడడం అనేది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని కపిల్ అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సంకేతాలుసైతం ఇచ్చానని.. కానీ ముందస్తుగా ఎవరూ అర్థం చేసుకోకపోవటం నన్నే ఆశ్చర్యపర్చిందంటూ చమత్కరించారు.

Kapil Sibal : కాంగ్రెస్ లో అధ్యక్షుడే లేరు..పంజాబ్ పరిణమాలు పాక్ కి లాభం..సోనియాకి ఆజాద్ లేఖ

కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్ సుదీర్ఘకాలం సేవలదించారు. న్యాయ నిపుణుడిగా కాంగ్రెస్ లీగల్ వింగ్ ను పర్యవేక్షించారు. ప్రస్తుతం కపిల్ కాంగ్రెస్ ను వీడటం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయన గాంధీ కుటుంబంతో విబేధాల కారణంగానే పార్టీని వీడినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ రెబల్ గ్రూప్ జీ-23లో కపిల్ సిబల్ కూడా ఉండేవారు. గాంధీ కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినవారిలో కపిల్ ఒకరు.