kapil sibal : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్..సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగల నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబాల్ సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు.

kapil sibal : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్..సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్

Kapil Sibal

kapil sibal : 100 ఏళ్లకు పైగా  చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగల నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబాల్ సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో బుధవారం (మే 25,2022) సమావేశమయ్యారు.ఈక్రమంలో కపిల్ సిబాల్ సమాజ్ వాదీ పార్టీ తరపు నుంచి లక్నోలో రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. కాగా..రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి.

కపిల్ సిబల్ నామినేషన్ పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసారని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. మొదటి నమోదు పూర్తయింది. రాజ్యసభకు మరో ఇద్దరి పేర్లను త్వరలో ప్రకటించనున్నారు.