JNUలోకి ముసుగు వ్యక్తులు ఎలా వచ్చారు?విద్యార్ధులపై దాడి..దర్యాప్తు జరపాల్సిందే

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 07:30 AM IST
JNUలోకి ముసుగు వ్యక్తులు ఎలా వచ్చారు?విద్యార్ధులపై దాడి..దర్యాప్తు జరపాల్సిందే

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లోకి ముసుగు ధరించిన దుండగులు ఎలా వచ్చారు?వాళ్లను లోపలికి ఎవరు రానిచ్చారు? ఎలా వచ్చారు? అనే విషయంపై సమగ్రమంగా దర్యాప్తు జరిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. JNUలో హింసను కొంతమంది కుట్ర ఉందనీ..ఇది పక్కా ప్లాన్ ప్రకారంగా జరిగిందేనని కపిల్‌ సిబల్‌  ఆరోపించారు.  ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

మాస్కులు ధరించిన వ్యక్తులను క్యాంపస్‌లోకి ఎందుకు రానిచ్చారు? ఆ సమయంలో వర్సిటీ వీసీ ఏం చేస్తున్నారు? అదే సమయానికి  పోలీసులు వర్సిటీ బయట ఎందుకు ఉన్నారు? వర్శిటీల్లో ఇంత ఘోరమైన హింసాత్మక ఘటన జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? వీటన్నింటికి సమాధానం లేదు. ప్రశ్నించినవారిపై ఎదురు దాడికి దిగుతున్నారు తప్ప దీనిపిై సమాధానం  చెప్పేవారు కూడా లేరని కపిల్‌ సిబల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. 

పోలీసుల్ని షా నియంత్రిస్తున్నారు : రణదీప్ సుర్జేవాలా 
జేఎన్‌యూలో హింస వర్శిటీ అధికార యంత్రాంగం..ఢిల్లీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందని కాంగ్రెస్‌ మరో నేత రణదీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. వర్శిటీలో ఇటువంటి హింస జరుగుతుంటే పోలీసులు మాత్రం వేడుక చూస్తున్నారనీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులను ఏం చేయకుండా వేడుక చూస్తున్నారని విమర్శించారు. పోలీసుల్ని అమిత్ షా  నియంత్రిస్తున్నారని ఆరోపించారు. దుండగుల దాడులకు విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ అసలు క్యాంపస్ లో ఉండాలా లేదా వెళ్లిపోవాలని కొంతమంది విద్యార్ధులు భయాందోళనలకు గురవుతున్నారనీ..ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్ధులు వర్శిటీలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడతాయని దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రణదీప్ సుర్జేవాలా.