Gujarat : కరోనా కప్పా వేరియంట్ కలకలం, ఐదు కేసులు!

దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లు అతలాకుతలం చేయగా.. మరో వేరియంట్‌ గుజరాత్‌ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. గుజరాత్‌లో తాజాగా కరోనా కప్పా వేరియంట్‌ను గుర్తించారు వైద్యులు. ఐదు కేసులు గుర్తించినట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Gujarat : కరోనా కప్పా వేరియంట్ కలకలం, ఐదు కేసులు!

Kappa

Kappa Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లు అతలాకుతలం చేయగా.. మరో వేరియంట్‌ గుజరాత్‌ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. గుజరాత్‌లో తాజాగా కరోనా కప్పా వేరియంట్‌ను గుర్తించారు వైద్యులు. ఐదు కేసులు గుర్తించినట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. జామ్‌నగర్‌లో 3, గోద్రా, మెహసానాలో ఒక్కో కేసు నమోదైంది.

ఈ ఏడాది మార్చి, జూన్‌ మధ్య కోవిడ్ పరీక్షలు చేసిన రోగుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. పరీక్షల్లో కప్పా వేరియంట్‌ సోకినట్లు తేలింది. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో పడింది గుజరాత్‌ ఆరోగ్యశాఖ. కేసులు నమోదైన ప్రాంతాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది.

దేశంలో కప్పా వేరియంట్ గత ఏడాది అక్టోబర్‌లోనే బయటపడింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించాల్సిన వేరియంట్‌ గా వర్గీకరించింది. భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌కు.. కొత్త మ్యుటేషన్ భిన్నంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. డెల్టాను WHO ఆందోళనకరమైన వేరియంట్ గా గుర్తించింది. అయితే కప్పా వేరియంట్‌ను మాత్రం ఈ జాబితాలో చేర్చలేదు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో కప్పా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం కోవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్యంతో కొత్త వేరియంట్‌ను నిరోధించవచ్చని వైద్యాధికారులు తెలిపారు.