Bengaluru : చనిపోదామని ఇల్లొదిలిపోయి..మృత్యు ఒడిలో అలా వెళ్లి పడుకున్న 18 ఏళ్ల బాలుడు | 18 year old Bengaluru boy leaves home to die

Bengaluru : చనిపోదామని ఇల్లొదిలిపోయి..మృత్యు ఒడిలో అలా వెళ్లి పడుకున్న 18 ఏళ్ల బాలుడు

చనిపోతున్నాను అంటూ ఓ లేఖ రాసి ఇల్లొదిలి వెళ్లిపోయాడో 18 ఏళ్ల బాలుడు. కానీ అప్పటికే  పొంచి ఉన్న మృత్యువు ఒడిలో పడుకున్నాడు. 100 ఏళ్ల భవిత ఉన్న 18 ఏళ్ల పిల్లాడు చనిపోయిన తీరు చూస్తే ఎవ్వరికైనా హృదయం పగిలిపోతుంది.

Bengaluru : చనిపోదామని ఇల్లొదిలిపోయి..మృత్యు ఒడిలో అలా వెళ్లి పడుకున్న 18 ఏళ్ల బాలుడు

18 year old Bengaluru boy leaves home to die :  చనిపోతున్నాను అంటూ ఓ లేఖ రాసి ఇల్లొదిలి వెళ్లిపోయాడో 18 ఏళ్ల బాలుడు. కానీ అప్పటికే  పొంచి ఉన్న మృత్యువు ఒడిలో పడుకున్నాడు. 100 ఏళ్ల భవిత ఉన్న 18 ఏళ్ల పిల్లాడు చనిపోయిన తీరు చూస్తే ఎవ్వరికైనా హృదయం పగిలిపోతుంది. తానే స్వయంగా మృత్యుదేవత ఒడిలో పడుకున్నాడు. 18ఏళ్ల బాలుడు ఇసుకలో సజీవంగా సమాధి అయిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని హోస్కేట్ టౌన్ ఖాట్మండు లేఅవుట్ నివాసి అయిన సోమనాథ్ అనే 18 ఏళ్ల బాలుడు చదువుల్లో ఫస్టుగా ఉండేవాడు.ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. ఓరోజు తన తోటి విద్యార్థులతో చిన్న గొడవ జరిగింది. ఈ గొడవలో తోటి విద్యార్ధులు నిన్ను చంపేస్తాం అంటూ బెదిరించారు. నువ్వు ఎక్కడ దాక్కున్నా చంపేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో సోమనాథ్ వాళ్లు చంపటం ఏంటీ నేను చచ్చిపోతాను అనుకుని ఓ లేక రాసి మేన 4న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

స్నేహితులు తనను చంపుతామని బెదిరించారని.. తానే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఒక లేఖ రాసి పెట్టాడు. తన స్నేహితులను ఏమీ అనొద్దని లేఖలో కోరాడు. అతడి తండ్రి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో వుడ్ వర్క్ చేస్తుంటాడు. శనివారం (మే8,2022) ఉదయం మరతహళ్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు.. ఇసుకను ట్రక్ నుంచి అన్ లోడ్ చేస్తుండగా సోమనాథ్ శవం బయటపడింది. అతడి జేబులోని మాస్క్ ఆధారంగా పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

పోస్ట్ మార్టమ్ చేసిన వైద్యులు సోమనాథ్ ఊపిరితిత్తుల్లో ఇసుక రేణువులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇంటి నుంచి వచ్చిన సోమనాథ్ ఖాళీ ట్రక్ పైకి ఎక్కి పడుకుని ఉంటాడని.. అతడ్ని చూడని సిబ్బంది అందులో ఇసుకను లోడ్ చేయించుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

×