Karnataka: అంతరించిపోతున్న జీవుల అక్రమ రవాణా.. ఎయిర్‌పోర్టులో 18 జీవుల స్వాధీనం.. నిందితుల అరెస్ట్

బెంగళూరు, కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుల దగ్గరి నుంచి 18 అరుదైన జీవుల్ని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏడుగురు ప్రయాణికులు లగేజీలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. నిందితుల్ని అరెస్టు చేశారు.

Karnataka: అంతరించిపోతున్న జీవుల అక్రమ రవాణా.. ఎయిర్‌పోర్టులో 18 జీవుల స్వాధీనం.. నిందితుల అరెస్ట్

Karnataka: అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న జంతువుల్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. బెంగళూరు, కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుల దగ్గరి నుంచి 18 అరుదైన జీవుల్ని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

వీటిని ఏడుగురు ప్రయాణికులు లగేజీలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ముందుగా ముగ్గురు నిందితుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మిగతా నలుగురికి సంబంధించిన విషయం బయటపడింది. దీంతో వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో యెల్లో-గ్రీన్ అనకొండ, పసుపు రంగు తల కలిగిన అమెజాన్ చిలుక, నైల్ మానిటర్, రెడ్ ఫుట్ తాబేలు, బాల్ పైథాన్స్, అలిగేటర్ గార్, యాకి మంకీ, ఊసరవెల్లి, రకూన్ జాతి కుక్క వంటివి ఉన్నాయి. వీటిని ప్రయాణికులు బ్యాంకాక్ (థాయ్‌లాండ్) నుంచి ఇండియా తీసుకొచ్చారు.

#MannKiBaat: తెలంగాణకు చెందిన విజయ్ అనే ఇంజనీర్ చేసిన‌ పోస్ట్ ను చూశాను: మోదీ

ఈ జీవులు అరుదైన, అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఈ జంతువులతోపాటు వాటికి సంబంధించిన అవయవాలు, ఉత్పత్తుల్ని రవాణా చేయడం మన దేశంలో నిషేధం. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1872 ప్రకారం ఇది చట్ట విరుద్ధం. ఇక్కడ నిందితుల నుంచి లభించిన సమాచారం ఆధారంగా బెంగళూరు సమీపంలోని ఒక ఫామ్‌హౌజ్‌పై అటవీశాఖాధికారులు దాడి చేసి, 48 జాతులకు చెందిన 139 జంతువుల్ని స్వాధీనం చేసుకున్నారు.