ఎమ్మెల్యేలు,మంత్రుల జీతాల్లో ఏడాది పాటు 30శాతం కోత విధించిన కర్ణాటక

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2020 / 09:36 AM IST
ఎమ్మెల్యేలు,మంత్రుల జీతాల్లో ఏడాది పాటు 30శాతం కోత విధించిన కర్ణాటక

కరోనా సంక్షోభహం నేపథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,మంత్రులందరి జీతాల్లో 30శాతం కోత విధించేందుకు కార్ణాటక కేబినెట్ ఇవాళ(ఏప్రిల్-9,2020)ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ను పాస్ చేసినట్లు  ఆయన తెలిపారు.

కేబినెట్ మీటింగ్ తర్వాత మధుస్వామి మీడియాతో మాట్లాడారు. స్పీకర్,డిప్యూటీ సీకర్, చీఫ్ విప్ లతో సహా మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల అందరి జీతాల్లో ఏప్రిల్-1,2020నుంచి ఏడాదిపాటు 30శాతం కోతను విధిస్తున్నట్లు మధుస్వామి తెలిపారు. అన్ని పార్టీల నుంచి ఈ విషయంలో తమకు మద్దతు లభించిందని తెలిపారు. దీంతో ఇవాళ ఆర్డినెన్స్ పాస్ చేసినట్లు తెలిపారు. 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం,మహారాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు,మంత్రులుఎమ్మెల్సీల జీతాల్లో కోతలను విధించిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రప్రభుత్వం కూడా రెండేళ్లపాటు ప్రధానితో సహా ఎంపీల జీతాల్లో 30శాతం కోతను విధించేందుకు మరియు MP ల్యాడ్(MPLAD)స్కీమ్ ను రెండేళ్లపాటు రద్దు చేసేందుకు ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి జీతాల్లో కూడా కోత విధించారు.

Also Read | ట్రంప్ కు WHO చురకలు : రాజకీయాలు మాని…వైరస్ పై యుద్ధం చేయాలి